కుల్కచర్ల, ప్రజాతంత్ర, అక్టోబర్09: గొల్ల కుర్మలకు రెండో విడత గొర్రెలను వెంటనే పంపిణీ చేయాలని ధర్నా చేపట్టారు.డిపాసిట్ లేకుండా వెంటనే గొర్రెలు ఇవ్వాలనిఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు.సోమవారంనాడు కుల్కచర్ల ప్రధాన చౌరస్తాలో గొల్ల కాపరులు ర్యాలీతో రోడ్డు ఎక్కారు. మండల వ్యాప్తంగా ఉన్న గొల్ల, కుర్మా లు ప్రభుత్వాన్ని నిలదీస్తూ నిరసన తెలిపారు. డీడీలు కట్టి నెలలు గడుస్తున్న ప్రభుత్వం గొర్లను పంపిణీ చేయకపోవడం గొల్ల కాపర్లను ఆగ్రహానికి గురిచేసిందని అన్నారు.గొల్ల కాపరులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో గొల్ల, కుర్మా సంఘం నాయకులు బిజిరం రాంచంద్రయ్య, జింకాల యాదయ్య,చిన్నమల్లెల భాస్కర్,వార్ల అంజిలయ్య, కుర్వ గొల్ల,సంఘ సభ్యులు పాల్గొన్నారు.
గొల్ల, కుర్మలకు రెండో విడత గొర్రెలను వెంటనే పంపిణీ చేయాలని రాస్తా ధర్నా





