గులాబీమయమైన ఇంద్రేశం.

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: ప్రజల ఆశీర్వాదంతో పటాన్ చెరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తామని పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు మండలం ఇంద్రేశం పిఎన్ఆర్, ఆర్కే వన్ కాలనీలలో  ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వందలాది మంది కార్యకర్తలు, కాలనీవాసులు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు.రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ను బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు.అనంతరం సాయి వైభవ్ కాలనీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. కాలనీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. ప్రధానంగా సిసి రోడ్డు నిర్మాణ పనులను వచ్చే 10 రోజుల్లో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయం అందించాలని విజ్ఞప్తి చేశారు.సాయి వైభవ్ కాలనీలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ నర్సింలు, సీనియర్ నాయకులు బండి హరి శంకర్, అంతిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివారెడ్డి, మెరాజ్ ఖాన్, గ్రామ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *