కందుకూరు,ప్రజాతంత్ర,జూలై 22 : గుర్తు తెలియని వాహనం డీకొట్టడంతో ఓవ్యక్తిపై నుండి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. సంఘటనకు సంబంధించి వివరాల ప్రకారం కందుకూరు మండల పరిధిలోని నేదునూరు గేటు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి తలపై గుర్తుతెలియని వాహనం డికొట్టి వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.మృతుని వయస్సు సుమారు (35-40)ఉంటుంది.విషయం తెలుసుకున్న కందుకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మృతుని శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి నట్లు కందుకూరు పోలీసులు తెలిపారు.మృతుడిని గుర్తు పట్టరాని విడంగా ఉందని,మృతిని ఒంటిపై నీలిరంగు టీ షర్టు ఉందని ఎవరైనా గుర్తుపట్టిన ఎడల తమకు సమాచారాన్ని అందించాలని పోలీసులు తెలిపారు.



