– వాగ్దానాలకే పరిమితమైన హామీలు
– పట్టించుకోని ప్రజాప్రతినిధులు
– బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, షాద్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి
షాద్ నగర్ ప్రజాతంత్ర జూలై 14: గుంతలమయంగా మారిన షాద్ నగర్, పరిగి రోడ్డు మరమ్మత్తు పనులను వెంటనే ప్రారంభించి పూర్తిచేయాలని బిజెపి షాద్ నగర్ మున్సిపాలిటీ అధ్యక్షులు మఠం ఋషికేష్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిజెపి షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జి నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య, అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ టి. విజయ్ కుమార్, బిజెపి సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, మిథున్ రెడ్డి, వంశీ కృష్ణ, చెట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. వందల సంఖ్యలో ప్రయాణించే షాద్ నగర్, పరిగి రోడ్డు మొత్తం గుంతల మయంగా మారి, అనేక రోజులుగా ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నా స్థానిక ప్రజా ప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని అన్నారు. గొప్పగా శంకుస్థాపనలు చేస్తారు కానీ పనులకు నిధులు కేటాయించరు. ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసిందని, ఎన్నికల కోసం మాత్రమే శంకుస్థాపనలు చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. .
రోడ్లను అద్దాలుగా మారుస్తామని షాద్ నగర్, పరిగి రోడ్డు శంకుస్థాపన చేసి మూడు నెలలు అయింది కదా ఇంకెప్పుడు ప్రారంభిస్తారని ఆయన ప్రశ్నించారు. వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులను ప్రారంభించకపోతే ప్రజలతో వచ్చి ఎమ్మెల్యే క్యాంపు ఆఫిస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మల్చలం మురళి, ఇసునాతి శ్రీనివాస్, మోహన్ సింగ్ నాయక్, ప్యాట అశోక్, లక్ష్మీకాంత్ రెడ్డి, హరీష్ ముదిరాజ్, గజ్జల ప్రవీణ్, సుధాకరప్ప, శ్రీనివాస్ చారి, శ్యామ్ సుందర్, కాసోజు శివ తదితరులు పాల్గొన్నారు.




