పటాన్చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: గీతం స్మార్ట్ ఐడియాథాన్ ( అత్యుత్తమ ఆవిష్కరణలు చేసిన విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమం) గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ ప్రాంగణంలో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. స్టార్టప్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ (సీఈఎం), బోస్టన్లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎడ్యుకేషన్ (ఎన్ఎయూసీఈఈ)ల సహకారంతో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల కార్యక్రమ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా హెదరాబాద్ ఏంజెల్స్ చైర్మన్ రాజేష్ మంతెన, ఆత్మీయ అతిథిగా కంట్రోల్ ఎస్ క్వాలిటీ- ప్రొక్యూర్మెంట్ హెడ్ చంద్రశేఖర్ శర్మ గరిమెళ్ల పాల్గొన్నారు.యువత జీవితంలో రాణించడానికి ఉపకరించే ప్రాథమిక అంశాలెన ఉత్సుకత, ధైర్యం, శీలం, భావప్రకటనా నెఫుణ్యాల గురించి రాజేష్ మంతెన వివరించారు. ఎప్పటికప్పుడు మారుతున్న, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో నిరంతరం నేర్చుకునే ఉత్సుకత ఉండాలని, అప్పుడే వృద్ధితో పాటు అనుభవాన్ని కూడా గడిస్తామన్నారు. విద్యతో పాటు కళలు, సంగీతం, భౌతిక – జీవశాస్త్రం వంటి విభిన్న రంగాలలో కూడా నైపుణ్యం గడించడం ఉత్తమమని చెప్పారు. ధైర్యమంటే భయం లేకపోవడం కాదని, భయం కంటే ముఖ్యమైనది మరొకటి ఉందన్నారు. భయం ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకెళ్లడం, నిర్ణాయకశక్తిగా ఎదగడాన్ని సూపర్ పవర్‌గా ఆయన అభివర్ణించారు. సంక్లిష్టమైన పరిస్థితులను విశ్లేషించడం ద్వారా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సహోద్యోగులను గౌరవించాలని, చక్కగా వినడం, దీర్ఘదృష్టితో యోచించాలని రాజేష్ ఔత్సాహిక వ్యవస్థాపకులకు సలహా ఇచ్చారు. దయగా, మర్యాదగా, ఉదారంగా, నెత్తికంగా ఉండడమే అభివృద్ధి చెందడానికి సులువెన మార్గమన్నారు. భావ ప్రకటనా నెపుణ్యం ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెబుతూ, దానిని నిరంతర సాధనతో అలవరచుకోవాలని చెప్పారు. తమదైన శైలితో ఎంపిక చేసుకున్న రంగాలలో రాణించాలని రాజేష్ మంతెన సూచించారు.ఆత్మీయ అతిథి చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ, రాబడి అధికంగా ఉండే వాటిలో నూతన ఆవిష్కరణలు చేయాలని చెప్పడంతో పాటు కంట్రోల్ ఎస్ గురించి, దాని సేవలను వివరించారు. గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు ప్రారంభోపన్యాసం చేయగా, వీడీసీ డిప్యూటీ డెరైక్టర్ ఫకృద్దీన్ షేక్ అతిథులను స్వాగతించారు. నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ గ్రెగ్ కొల్లియర్, సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ రవి రామమూర్తి, గీతం చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ క్రిస్ నంగెగడ్డ, వీడీసీ డెరైక్టర్ డి. శ్రీదేవి తదితరులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.ప్రారంభోత్సవ వేడుకలు ముగిశాక, ‘ఉన్నత విద్యా సంస్థలలోని విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదిగే వాతావరణాన్ని ఎలా సృష్టించాలి’ అనే అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హెదరాబాద్ (రిచ్) జీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సుస్మిత సుందర్, వీహబ్ డెరైక్టర్ (వ్యూహం-భాగస్వామ్యం) సృజన చదలవాడ, ఐఎస్ఓలోని ఐ-వెంచర్ అసోసియేట్ వెస్ట్ ప్రెసిడెంట్ సురేష్ కృష్ణ, ఐటీఐసీ ధృవ్ గుప్తాలుపాల్గొన్నారు.ఆహారం-ఆరోగ్యం, స్టెమ్ కోసం బొమ్మలు, స్థిరమైన ఫ్యాషన్, పొదుపుగా ఉండే ఆవిష్కరణ అనే నాల ఇతివృత్తాలుగా నిర్వహిస్తున్న ఈ పోటీలలో దేశం నలుమూలల నుంచి 1,007 దరఖాస్తులు రాగా, వాటిలో 310 ఆహారం-ఆరోగ్యంపై_ 76 స్టెమ్ కోసం బొమ్మలు, 135 స్థిరమైన ఫ్యాషన్‌కు చెందినవి కాగా, గరిష్ఠంగా 489 దరఖాస్తులు పొదుపుగా ఉండే ఆవిష్కరణకు సంబంధించినవి. అనేక వడపోతల తరువాత 32 జట్లను సెమీ-ఫైనల్స్క ఎంపిక చేయగా, గురువారం ప్రజెంటేషన్లు పూర్తయ్యాక ఎనిమిది జట్లను తుది పోరుకు ఎంపిక చేశారు. అందులో అత్యుత్తమంగా నిలిచిన జట్టుకు రెండు లక్షల రూపాయల నగదు పురస్కారం, ద్వితీయ స్థానం పొందినవారికి లక్ష రూపాయలు ఇచ్చి సత్కరించనున్నారు.


