గీతం స్కాలర్ గిరిజకు పీహెచ్ డీ

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఏ.ఎం.గిరిజను డాక్టరేట్ వరించింది. క్యూయింగ్ మోడల్ ను ఉపయోగించి ఆస్పత్రికి రోగుల రాక నమానా, స్వీయ-సారూప్య ప్రవర్తన విశ్లేషణ అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పరిశోధనలో హర్ష్ ని ఉపయోగించి రోగుల రద్దీని తీవ్రతను కనుగొనడం, క్యూ పొడవును కొలవడం సులభం. దీనిని ప్రధానంగా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులలో ఉపయోగిస్తారు.గిరిజ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్ రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె. నగేష, గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మోతహర్ రెజా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *