పటాన్చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 9: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఏడుగురు విద్యార్థులకు పరపతి అభివృద్ధి కోసం ఉత్తమ వినియోగ పెట్టుబడి (బిల్డ్) గ్రాంటు లభించింది. ప్రతీ విద్యార్థీ ఈ పథకం కింద లక్షల రూపాయల నగదును అందుకుని తమ సృజనాత్మకతను చాటుకున్నారు. ఐఐటీ హైదరాబాద్ లోని ఐటీఐసీ ఇంక్యుబేటర్, గ్రీన్కో గ్రూపు గీతం ఆవిష్కర్తల అసాధారణమైన పనిని గుర్తించి, సత్కరించాయి. మురుగునీటి నిర్వహణలో స్థిరమెన పరిష్కారాలు చూపిన గీతం పూర్వ విద్యార్థి అనిక్ పంజా; అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వెన్నెముక ఆరోగ్యాన్ని పునర్నిర్వచించిన పూర్వ విద్యార్థి అనౌష్ కె.వి; స్టెమ్ క్వెస్ట్ ను రూపొందించిన సీఎస్ఈ రెండో ఏడాది విద్యార్థి లోచన్ మతుకుమిల్లి; మన దాహాన్ని తీర్చుకోవడానికి ఆరోగ్యకరమెన విధానాన్ని పరిచయం చేసిన బీ.ఫార్మా విద్యార్థిని నమ్రత యంత్రాప్రగడ; దృష్టి లోపం ఉన్న వారికి వినూత్న పరిష్కారం చూపిన బీ.కాం (హానర్స్) విద్యార్థిని సుష్మాదేవి ప్రత్తిపాటి; సృజనాత్మక చాతుర్యంతో షాపింగ్ అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చిన సీఎస్ఈ చివరి ఏడాది విద్యార్థి సజ్జాద్ హుస్సేన్; ఆస్తమా కేర్, మేనేజ్మెంట్లో తాజా జీవితాన్ని పొందేలా చేసిన సీఎస్ఈ మూడో ఏడాది విద్యార్థి మేడమల్లి సుచంద్రహాస్లు ఈ లక్ష రూపాయల గ్రాంటును అందుకున్నారు. ఈ పురస్కారం గీతం అందించిన ప్రోత్సాహక వాతావరణాన్ని మాత్రమే కాకుండా ఆవిష్కర్తల అసాధారణ ప్రతిభన కూడా వెల్లడిస్తోంది. గీతం అందించిన వనరులు, మార్గదర్శనం, ప్రోత్సాహకాలు ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ విజయాన్ని కొనసాగించాలని వెంచర్ డెవలప్మెంట్ కేంద్రంలోని శిక్షక్షులు కోరుకుంటున్నారు. సృజనాత్మకత, ఆవిష్కరణ సంస్కృతిని పెంపొందించుకోవడాన్ని గీతం ప్రోత్సహిస్తోంది.
గీతం విద్యార్థులకు బిల్డ్ గ్రాంటు



