పటన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: కేరళలో అత్యంత గౌరవ ప్రధంగా జరుపుకునే పంటల పండుగ ఓనమును గీతం ఢీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాదులో బుధవారం ఘనంగా నిర్వహించారు. సింఫని ఆఫ్ హార్మోని (భిన్న నముహాల సామ రస్యం) ఇతివృత్తంగా ఈ ఏడాది ఓనంను నిర్వహిస్తున్న విషయం విదిత్రమే. సంప్రదాయ దుస్తులు ధరించి, దవళ వర్ణంలో మెరిసిపోతున్న గీతం విద్యార్థులు, మన దేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఓనం ఉత్సవాలను జరుపుకున్నారు. శివాజీ ఆడిటోరియం ముందున్న హాల్లో పరచిన తివాచీలఫై సంప్రదాయ దుస్తుల్లో కలియ తిరుగుతూ, వివిద రకాల వంటకాలను సిద్ధం చేసి ఓనం పండుగ రుచులను ఆస్వాదించారు. శివాజీ ఆడిటోరియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు శోభయామానంగా నిర్వహించారు.


