- వీటిపై మాట్లాడాకనే ప్రధాని వరంగల్‌లో అడుగు పెట్టాలి
- గిరిజనులకు ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రధాని క్షమాపణలు చెప్పాలి
- ప్రధానిపై మంత్రి కెటిఆర్ ఫైర్
- మానుకోటలో గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ
- పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం
మహబూబాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30 : తెలంగాణ గిరిజన బిడ్డలకు ఇచ్చిన హావి•లను విస్మరించిన ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె తారకరామారావు డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజనులకు పోడుభూముల పట్టాల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ…ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రభుత్వం హావి• ఇచ్చింది. కేంద్రం అడిగితే గిరిజన యూనివర్శిటీ కోసం 360 ఎకరాల భూమిని ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటి వరకు వర్సిటీని ఎందుకు నెలకొల్పడం లేదని ప్రశ్నించారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం స్టీల్ అథారిటీ ద్వారా పెడుతామని హావి• ఇచ్చి తొమ్మిది సంవత్సరాలు అయింది. కాజిపేటలో కోచ్ ఫ్యాక్టరీ అన్నారు. కాని నేడు మోసం చేస్తున్నారు. రైళ్లను తయారు చేసే కోచ్ బదులు మరమ్మతులు చేసే దుకాణం పెడుతున్నారు.
ఇది ఎంతో అన్యాయమని కెటిఆర్ ఆరోపించారు. ఇచ్చిన మాట తప్పినందుకు తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని,ఇచ్చిన హావి•లపై వరంగల్ పర్యటనలో ప్రధాని మోదీ సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పిన తర్వాతే వరంగల్‌కు రావాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. మరో పదిరోజుల్లో నరేంద్ర మోదీ వరంగల్‌కు వొస్తున్నందున వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల తరుపున ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నానన్నారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామన్నారు..ఎందుకు పెట్టడం లేదు.. వరంగల్‌కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడుతామని మాట తప్పార న్నారు. రైళ్లు తయారీ కేంద్రం పెడతామని చెప్పి ఇప్పుడు మెకానిక్ ఫాక్టరీ పెడతా అంటున్నారని కేటీఆర్ విమర్శించారు. వీటన్నింటిపై మాట తప్పినందుకు మోదీ క్షమాపణ చెప్పి రావాలన్నారు.
పోడు పట్టాల పంపిణీ ద్వారా 4 లక్షల 6 వేల ఎకరాలు 1.50 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని..ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే 24,972 మంది రైతులకు 70,434 ఎకరాల భూమిని పంపిణీ చేస్తున్నామన్నారు. జల్ జంగల్ జవి•న్ అనే కొమురం భీం నినాదంతో అన్ని తండాలకు మంచినీరు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. బిందెలు, కుండలు పట్టుకుని ఆడపడుచులు రోడ్డు పైకి వొచ్చే పరిస్థితి తెలంగాణలో లేకుండా పోయిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హరితహారం పేరుతో చెట్ల పెంపకంతో పాటు ఇప్పుడు గిరిజనుల అభివృద్ధి కోసం పోడు పట్టాలు పంపిణీ చేసి భూమి కూడా ఇస్తున్నామన్నారు. 6 శాతం ఉన్న గిరిజనులు, ఆదివాసీల రిజర్వేషన్ ను 10 శాతంకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కేటీఆర్ అన్నారు. పోడు భూములకు పట్టాలు పొందడంతో పాటు రైతు బంధు, రైతు బీమా పొందుతున్నారు. జిల్లాల పునర్విభజన తరువాత వి•కు పాలన అందుబాటులోకి వొచ్చిందని కేటీఆర్ తెలిపారు. 10 మంది డాక్టర్లు లేని మహబూబాబాద్ సర్కారు దవాఖానకు 110 మంది వైద్యులు వచ్చారు..
కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దు..ఆచరణ సాధ్యం కాని హావి•లతో వి• ముందుకు వొస్తున్నారు..వారి మాటలు వింటే వి•రు మోసపోతారని మంత్రి కేటీఆర్ అన్నారు. గుజరాత్లో 21వేల కోట్ల రూపాయలతో కోచ్ ఫ్యాక్టరీ పెట్టారని ఆరోపించారు. గుజరాత్‌కు ఒక న్యాయం. తెలంగాణకు ఒక న్యాయం. ఇది మంచి పద్దతి కాదని అన్నారు. దేశానికి ప్రధాని మంత్రి తప్పా గుజరాత్‌కు కాదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రావడానికి ఆడే అబద్దాలను అసలే నమ్మవద్దని కోరారు. 50 సంవత్సరాలు మోసం చేశారు. మళ్లీ మోసం చేయడానికి వొస్తున్నరు. ఆగం కావద్దని సూచించారు. అన్ని రకాలుగా పేదలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను భారీ మెజారిటీ మరోసారి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్,ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపి కవిత మాలోత్ దితరులు పాల్గొన్నారు.
మానుకోట పర్యటనలో పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం
మహబూబాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గుమ్మడూరులోని రామచంద్రాపురం కాలనీలో 200 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి ప్రారంభించారు. లబ్దిదారులకు ఇంటి పేపర్లను అందజేశారు. అంతకుముందు మానుకోటలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రూ.50 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం రూ.5 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్, ఫ్రూట్స్, ప్లవర్ మార్కెట్లను ప్రారంభించారు. అనంతరం గుమ్మడూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో 24,181 మంది పోడు రైతులకు 67,730 ఎకరాలకు పోడు పట్టాలను మంత్రి కేటీఆర్ పంపిణీ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్యా నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు పాల్గొన్నారు.
కుమ్రం భీమ్ ఆశలు నెరవేర్చిన కెసిఆర్ : మంత్రి కెటిఆర్ ట్వీట్
నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాదు..జల్, జంగల్, జవి•న్ అనే కుమ్రం భీం కలలను కూడా అక్షరాలా సాకారం చేసిన ధీరోదాత్తమైన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. మొన్న కొండకోనల్లోని నివాసాలకు మిషన్ భగీరథతో స్వచ్ఛమైన ‘జల్’, నిన్న కంటికి రెప్పలా కాపాడటంతో.. రాష్ట్రంలో 7.70 శాతం ’జంగల్’ పెరిగిందని, నేడు 1.51 లక్షల మందికి ఏకంగా 4.60 లక్షల ఎకరాల ’జవి•న్’ పంచుతున్నారని చెప్పారు. గ్రామ పంచాయితీల ఏర్పాటుతో ‘మావ నాటే మావ రాజ్’ స్వప్నం సాకారమైందని వెల్లడించారు. పది శాతానికి పెరిగిన రిజర్వేషన్లతో గిరిజన బిడ్డల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందన్నారు. ఇలా ఒకటా..రెండా..పోడు భూముల గోడు తీర్చి..గిరిజన-ఆదివాసీల ఆశలన్నీ నెరవేర్చి, పట్టాలతో పట్టాభిషేకం చేస్తున్న తరుణమిదని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.



