మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 06: గిరిజన జాతికి గౌరవం తెచ్చి వారికి గుర్తింపు ఇచ్చి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ గిరిజన తాండాల అభివృద్ధి సంక్షేమానికి కృషిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్. ను, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పి. సబతా ఇంద్రారెడ్డి ని మరోసారిగెలిపించాలని రాష్ట్రగిరిజన, స్త్రీశిమసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.సోమవారం తుక్కుగూడ పురపాలక పరిధిలోని ఇమాంగూడ వద్ద జరిగిన గిరిజన ఆత్మీయసమ్మేళనంలో పాల్గొని మంత్రులు మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాతగిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేశారని అన్నారు. బి జె పి, కాంగ్రెస్‌లు గిరిజన వ్యతిరేకులు,ఆపార్టీలకు ఓట్లు వేసి వృధా చేసుకోవద్దని గిరిజనులకు పిలుపునిచ్చారు. గిరిజనులకు పోడు భూముల పట్టాలు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. మా గ్రామాల్లో మా రాజ్యం అనే బంజారా ప్రజలన నినాదాన్ని సాకారంచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి గిరిజనులు అండగా ఉండాలని అన్నారు. తండాలలో రోడ్లు, నీరు, లాంటి కనీస సౌకర్యాలతో పాటు పంచాయతీ భవనాలు నిర్మించామని గుర్తుచేశారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటువేసి ఆశీర్వదించాలని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తామని అన్నారు. కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, బి ఆర్ ఎస్
గిరిజన విభాగం నాయకులు ఎ రాజునాయక్, దేవ్లా నాయక్, లచ్చానాయక్, రవినాయక్, సీతారామ్ నాయక్, రాజునాయక్, సాలివీరానాయక్, దీప్లానాయక్, గిరిజన ప్రజాప్రతినిధులు, నాయకులుతదితరులు పాల్గొన్నారు.
గిరిజన జాతికి గుర్తింపు తెచ్చి సి ఎం కే సి ఆర్





