గాలికి ఉచిత ఎరువుల హావి

  • రైతులకు ఇచ్చిన హావి•లన్నీ ఉత్తివే
  • సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌లేఖ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 :  ‌సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్‌ ఇచ్చిన ఉచిత ఎరువుల హావి• గాలికి పోయిందన్నారు. రైతులకు ఇచ్చిన అన్ని హావి•లలాగే మాట ఇచ్చి వదిలేశారన్నారు. కేసీఆర్‌ ‌మాట ఇచ్చి నిలబడరని మరోసారి రుజువైందన్నారు. పైసలిచ్చి కొనుగోలు చేద్దామన్నా ఎరువులు దొరకడం లేదన్నారు. ఎరువుల కోసం రైతులు బారులు తీరారని రేవంత్‌ ‌పేర్కొన్నారు. ఎరువుల కోసం రైతులు క్యూలో చెప్పులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వొచ్చిందన్నారు. సీఎం సొంత జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. యూరియా నిల్వలు పెట్టాలనే సోయి ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వం ఎరువులను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకురావాలని రేవంత్‌ ‌కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *