గాడి తప్పిన గ్రామ స్వరాజ్యం!

పల్లె సీమలే ప్రగతికి పట్టు కొమ్మలు అన్నాడు మహాత్మ… ఇది ముమ్మాటికీ నిజమే అయినా  ప్రగతికి నోచుకోని  పేదరికం లో మగ్గుతున్న పల్లెలెన్నో విద్యా, వైద్యం మరియు సామాజిక రుగ్మతులతో మగ్గుతున్న పల్లెలెన్నో ఉపాధి కరువై రాజకీయాలు మెరుగై  పల్లెల్లో పనికి  దొరకక పరాయి రాష్ట్రాలనుండి  (బీహార్‌ ఒరిస్సా) కూలీలను అరువుతెచ్చుకునే దుస్థితి… కానీ ఉన్న ఊర్లో పనికి  కుదురక  దుబాయ్‌ ‌లాంటి దేశాల్లో వలస కార్మికులుగా చనిపోతున్న వారెందరో ,మూడంచెలుగల పంచాయితీరాజ్‌ ‌వ్యవస్థలో తొలి స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థనే గ్రామ పంచాయితీ అంటారు. ప్రభుత్వ ప్రకటన ద్వారా గ్రామ పంచాయితీలను నిర్ణయిస్తారు. రాజ్యాంగంలో గ్రామపంచాయితీల ఏర్పాటు, వాటి అధికారాలకు ప్రాధాన్యం ఇచ్చింది. భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్‌ ‌వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్‌. 1959 ‌నవంబరు 1న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌లో, దేశంలోనే రెండవదిగా మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా, షాద్‌నగర్‌లో ప్రారంభమైంది.

గ్రామా సచివాలయానికి గ్రామా సర్పంచే పెద్ద… అతని అధికారముతో గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపే బాధ్యత. నిధులు సమీకరణ పౌర సమాజానికి ప్రతి పైసా మేలు జరిగేలా చేయాల్సిన బాధ్యత గ్రామా సచివాలయాలు పాలక వర్గనిదే.. అయితే తెలంగాణ  రాష్ట్రము ఏర్పడిన తరువాత అర్హత కనీస కలిగిన ప్రతి గ్రామాన్ని తాండాల్ని  గ్రామా పంచాయితీలుగా ప్రకటించింది. హంగు ఆర్భాటాలతో ఎన్నికలు నిర్వహించి అన్ని అధికార పార్టీ స్థానాలే గెలుచుకొని అధికారన్ని వికేంద్రీకరణ చేసి అన్ని పంచియితీల్లో జెండా ఎగరేసింది ,అయితే ఈ గ్రామాలకు సరియైన నిధులు లేక కేంద్ర రాష్ట్ర తగాదాల్లో నలిగిపోతుంది. ఇప్పటికి కొన్ని గ్రామాల సర్పంచులు తమ సొంత ఆస్తులు తాకట్టు పెట్టి గ్రామాభివృధికి పాటుపడుతున్నారు అనే విషయాలను సామాజిక మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాము.నిధుల కొరత రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పరిపాలనపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు  పంపిణీ చేయడం లో విఫలమైన తరువాత  సహనం కోల్పోయిన సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీల పెద్దలు ఈ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్హునా గళం విప్పారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా గిరిజన తండాలను (తండాలు) గ్రామపంచాయతీలుగా అప్‌ ‌గ్రేడ్‌ ‌చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నేరుగా నిధులు పొందేలా చేసిన పొంతన లేని నిధుల కొరతతో ఆతలాకుతలమవుతున్నారు . చివరకు మంచినీటి కోసం పంపుసెట్‌ ‌రిపేర్‌ ‌చేయించడానికి నిధులు లేవు. రోడ్డు పక్కన శుభ్రం చేయిద్దామంటే పంచాయతీ సిబ్బందికే జీతాలు చెల్లించలేని పరిస్థితి. అదనంగా ఖర్చు చేసేందుకు అవకాశం లేదు. అప్పటికీ ప్రజల నుంచి ఒత్తిడి రావడం వల్ల మా సొంతంగా కొన్ని పనులు చేసినా ఆ నిధులు కూడా విడుదల కావడం లేదు. అసలు ఎందుకు సర్పంచ్‌ అయ్యానో నాకే అర్థం కావడం లేదు.’’ఇదీ ఓ సర్పంచ్‌ ఆవేదన.

నిధుల కొరత రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పరిపాలనపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు  పంపిణీ చేయడం లో విఫలమైన తరువాత  సహనం కోల్పోయిన సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీల పెద్దలు ఈ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గళం విప్పారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా గిరిజన తండాలను (తండాలు) గ్రామపంచాయతీలుగా అప్‌ ‌గ్రేడ్‌ ‌చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నేరుగా నిధులు పొందేలా చేసిన పొంతన లేని నిధుల కొరతతో ఆతలాకుతలమవుతున్నారు .అయితే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి నిధుల ప్రవాహం సరిపోవడం లేదు. ఏడాది కాలంగా సర్పంచ్‌ ‌లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక కొందరు సర్పంచ్‌ ‌లు తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించగా, మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం మహిళా అధ్యక్షురాలు జె.ధనలక్ష్మి ఈ మధ్య జరిగిన ఆందోళనలో మాట్లాడుతూ నిధులు మంజూరైన 40 రోజుల్లో రైతువేదిక నిర్మించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని సర్పంచులకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసిందన్నారు. ప్రభుత్వం ఒత్తిడి భరించలేక కొందరు తమ జేబుల నుంచి ఖర్చు చేసి నిర్మాణ పనులు చేపట్టారు.

గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే ఇప్పటికే కష్టాల్లో ఉన్న సర్పంచులను ఎవరు ఆదుకుంటారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయతీలు ఉండగా, మెజారిటీ సర్పంచులు బీఆర్‌ఎస్‌ ‌తో అనుబంధం ఉన్నవారే. అయితే ప్రస్తుత సంక్షోభం దృష్ట్యా పార్టీలకు అతీతంగా సర్పంచులు ఏకతాటిపైకి వచ్చి ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే దిశలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలున్నాయని ప్రతిపక్షం విమర్శిస్తోంది. గత ప్రభుత్వ హయం నుంచి పేరుకుపోయిన పంచాయతీల విద్యుత్‌ ‌బకాయిలకు వడ్డీల భారం తప్పించేందుకే ఈ ప్రయత్నమని ప్రభుత్వం అంటోంది. పంచాయతీలకు సొంత నిధులు చాలా స్వల్పంగా ఉంటాయి. గ్రామంలో వసూలు చేసే ఆస్తిపన్ను, కుళాయిపన్ను, షాపుల అద్దె రూపంలో వచ్చే ఆదాయంతో పాటుగా చెరువులు, ఇతర ఆదాయ వనరుల నుంచి లభించే మొత్తం స్వల్పంగానే ఉంటుంది. సగటున 70 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధుల మీదే పంచాయతీల పాలన సాగుతుంది.

కొన్ని మేజర్‌ ‌పంచాయతీలు మినహా మైనర్‌ ‌పంచాయతీలయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల మీదనే ఆధారపడతాయి. అందులో తలసరి గ్రాంటు, వృత్తిపన్ను, సీవరేజి నిధులు, గ్రామంలో జరిగే ఆస్తుల క్రయ విక్రయాలపై రిజిస్ట్రేషన్‌ ‌ఫీజుల ద్వారా లభించే ఆదాయంలో వాటా వంటివి పంచాయతీలకు దక్కుతాయి..నిధులు లేని కారణంగా పంచాయతీల్లో సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా మారిపోతున్నారని రాజకీయ  క్రీనీడలో తలమాసిన నేతల మిగిలిపోతున్నారని ఓ సర్పంచ్‌ ఆవేదన వ్యక్తం చేసారు.కొత్త పంచాయతీరాజ్‌ ‌చట్టం ప్రకారం సెంట్రల్‌ ‌పూల్‌ ‌నుంచి వసూలు చేసిన స్టాంప్‌ ‌డ్యూటీ, మైనింగ్‌ ‌సెస్‌ ‌ను గ్రామ పంచాయతీల్లో జమ చేశారు. నిధుల డిపాజిట్‌ ‌కోసం వేర్వేరు బ్యాంకు ఖాతాలు తెరవాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని, కానీ డిసెంబర్‌ ఆఖరు వారంలోనే నిధులు విడుదల చేసిందని పలువురు వాపోయారు.

కొత్త పంచాయతీరాజ్‌ ‌చట్టం ప్రకారం సెంట్రల్‌ ‌పూల్‌ ‌నుంచి వసూలు చేసిన స్టాంప్‌ ‌డ్యూటీ, మైనింగ్‌ ‌సెస్‌ ‌ను గ్రామ పంచాయతీల్లో జమ చేశారు. నిధుల డిపాజిట్‌ ‌కోసం వేర్వేరు బ్యాంకు ఖాతాలు తెరవాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని, కానీ డిసెంబర్‌ ఆఖరు  వారంలోనే నిధులు విడుదల చేసిందని పలువురు వాపోయారు. గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులను తమకు తెలియకుండా దారి మళ్లించడం వల్లే పలువురు సర్పంచ్‌ ‌లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ ‌నేతలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 11వ ఆర్థిక సంఘం కింద గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసింది. జీపీల కోసం కేటాయించిన రూ.35 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. పంచాయతీలో జనరల్‌ ‌ఫండ్‌ ఐదారు లక్షల వరకు మాత్రమే వస్తుంది. వాటితో సిబ్బంది జీతాలు, తాగునీటి సరఫరా, ఫాగింగ్‌ ‌వంటి పనులు చేయడమే గగనం. అందుకే కేంద్రం నుంచి వచ్చే నిధులతో మాత్రమే కొన్ని పనులు చేయగలుగుతాం. కానీ ఇప్పుడు మాకు తెలియకుండానే, వచ్చిన నిధులు వచ్చినట్టే మాయమైపోతున్నాయి. మేం ఇక ఏం పని చేయగలం.

ఇప్పటికే రూ.10 లక్షల వరకు పంచాయతీలో చేసిన పనులకు బిల్లులు పెండింగులో ఉన్నాయి.. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు మరియు రాష్ట్రాలనుండి వచ్చిన నిధులు  అవి కూడా అకౌంట్‌లో ఉంటాయా? లేక మాయం అవుతాయా? అనేది తెలియడం లేదు. పంచాయతీలో తిరగలేకపోతున్నాం. మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి అని ఓ గ్రామా సర్పంచ్‌  ‌పాటి దినకర్‌ ‌చెప్పారు.పద్నాలుగో ఆర్థిక సంఘం 2015-16 సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది.5 సంవత్సరాల కాలానికి అంటే 2019-20 వరకు కొనసాగుతుంది మరియు మొత్తం గ్రాంట్‌ ‌ను సిఫారసు చేసింది గ్రామ పంచాయితీలు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. .5 సంవత్సరాల కాలానికి అంటే 2019-20 వరకు కొనసాగుతుంది మరియు మొత్తం గ్రాంట్‌ ‌ను సిఫారసు చేసింది. గ్రామ పంచాయితీలు తదుపరి ప్రభుత్వం ఈ  నిధులను14వ ఆర్థిక సంఘం ప్రకారము  సమర్థవంతంగా ఉపయోగించడానికి మార్గదర్శకాలను జారీ చేసింది 1) 50 శాతం క్యాపిటల్‌ ‌వర్కస్ ‌ఖర్చు. 2) 15% పారిశుధ్యం 3) 10% తాగునీరు 4) 10% వీధి దీపాలు5) కేంద్ర పంచాయతీరాజ్‌ ‌మంత్రిత్వ శాఖ సిఫారసు చేసిన విధంగా 10% ఓ అండ్‌ ఎం6) 5% ‌కనిపించని ఖర్చు దీని ప్రకారం రూ.105.41 కోట్ల పెర్ఫార్మెన్స్ ‌గ్రాంట్‌ ‌నుంచి 50 శాతం అంటే రూ.52.70 కోట్లు 6360 గ్రామ పంచాయతీలకు విడుదల చేశారు.వారి స్వంత మూల ఆదాయంలో పెరుగుదల చూపించబడింది మరియు మిగిలిన 50% రూ.52.70వసూలు చేసిన 2674 గ్రామ పంచాయతీలకు కోట్లు విడుదల చేశారు.100% పన్నువసులు పని చేసారు .

దీంతోపాటు కేంద్ర పంచాయతీరాజ్‌ ‌మంత్రిత్వ శాఖ మరో జాబితాను విడుదల చేసింది. విడుదలకు తప్పనిసరి అయిన పెర్ఫార్మెన్స్ ‌గ్రాంట్‌ ‌విడుదల కొరకు మార్గదర్శకాలు విడుదల చేసింది . 1. అకౌంట్స్ ఆడిట్‌. 2. ‌సొంత ఆదాయ వనరుల పెంపు. 3. జీపీడీపీ తయారు చేసి ప్లాన్‌ ‌ప్లస్లో అప్లోడ్‌ ‌చేయాలి. 4. మినిస్ట్రీ యొక్క డ్యాష్‌ ‌బోర్డ్/‌వెబ్‌ ‌సైట్‌ ‌లో %ఖీఖీ•% వ్యయాన్ని ప్రదర్శించడం పంచాయితీ రాజ్‌, ‌భారత ప్రభుత్వం   పంచాయితీల ప్రత్యేక విధి ఏది ఏమైనప్పటికీ  రాష్ట్రాలనుండి నిధులు లేక కేంద్ర నిధుల పైనా నజర్‌ ఏసీ నిధులు లేమితో  పని పూర్తిగా  జరగట్లేదనేది స్థానిక సంస్థ పరిపాలన అధికారుల ఆవేదన… అదే కేరళ రాష్ట్రం ను  ఆదర్శంగా తీసుకుంటే అక్కడి గ్రామా పంచాయితీకి ఆ సర్పంచి పవర్‌ ‌స్థానిక ఎం ఎల్‌ ఏ ‌కంటే అధికంగా ఉంటుంది. అది ఏంటంటే ఆ ఉరి లో పని చేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆ గ్రామా సచివాలయం నుండే జీతాన్ని  పుచ్చుకుంటాడు అంటే చెక్‌ ‌పవర్‌ ‌సర్పించికే అధికం అంతే కాకుండా అధిక నిధుల తో అక్కడి గ్రామా పంచాయతీలు ఆదర్శ పంచాయితీలుగా కొలువు   తీరాయి. మరో వైపు 15 వ ఆర్థిక సంఘం  నిధుల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనాన్ని తగ్గించాలి నిధులు మళ్లించకుండా  రాష్ట్ర పథకాలకు ఉపయోగించకుండా నిఘా నిర్వహించి సర్పంచులకు గ్రామాధికారులకు ప్రత్యక హక్కులు కల్పిస్తూ ఉత్తరువులు జారి చెయ్యాలి.. అంతేకాకుండా వీడియో సమావేశాలతో నిధుల ఖర్చుని ఎప్పటికప్పుడు ఆడిటింగ్‌ ‌నిర్వహించాలి.

గ్రామాల్లో ఉపాధి కి ఊతమిస్తూ నిరుద్యోగ ని నిర్ములించాలంటే  ప్రతి పంచాయితీ లో ఉద్యోగ మేలా నిర్వహించాలి. ఆర్ధికంగా నిలదొక్కుకోవాలంటే నిధుల సమీకరణ విరివిగా జరగాలి అప్పుడే పేదరికము లేని గ్రామా స్వరాజ్యాన్ని నిర్మించవచ్చు.. తద్వారా నిర్మలమైన నిజమైన సాధికారత కలిగిన భారతాన్ని ఆస్వదించవచ్చు…

– డా.కృష్ణా సామల్ల
ప్రొఫెసర్‌, 9705890045

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *