– యాదగిరిపల్లి పీహెచ్సీ వైద్యులకు కలెక్టర్ సూచన
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 14: యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్పిటల్లో అటెండెన్స్, ఓపి రిజిస్టర్లను పరిశీలించారు. శుక్రవారం ఎంతమంది పేషెంట్లు ఓపికి వచ్చారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న వారితో మాట్లాడుతూ హాస్పిటల్లో ఉన్న డాక్టర్, సిబ్బంది వైద్య పరీక్షలకు వచ్చేవారితో సరిగా వుంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. గత నెలలో ఈ హాస్పిటల్లో ఎన్ని సాధారణ ప్రసవాలు జరిగాయో తెలుసుకున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ అయిన గర్భిణి కుటుంబ సభ్యులతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు, డాక్టర్లు ,సిబ్బంది ఎలా స్పందించారు.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా అని అడిగారు. హాస్పిటల్కు వచ్చే గర్భిణిలతో వైద్యాధికారులు మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చే పేషంట్లకు వైద్యులు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గర్భిణుల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవాలి



