గ్లాసులోకి చేరి పెగ్గుగా మారి..
నాసికల్లోకి ఘాటుగా దూరి..
నాలుకపై అలలా నాట్యమాడి..
గొంతులోంచి చల్లగా జారి..
నరాలు, కండరాల్ని నిద్రలేపి..
చుక్కకు తోడుగా ముక్కలు చేరి..
నమ్మించి దేహాన్ని వశపర్చుకొని..
మాటలో మత్తును నింపి..
నడకకు తికమకలు నేర్పి..
నరుల్ని దాసోహం చేసుకొని..
నాటకమాడిస్తున్నది మందు
ఊగి తూగేలా వశపర్చుకునే వైన్‌
ఉచితంగా తాగుబోతును చేసి..
జనంలో తల దించుకునేలా చేసి..
కిక్కు గమ్మత్తులు చేసే ఆల్కహాల్‌
‌మత్తుకు లోకులంతా గులాంలే !

– డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగరం,  9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *