తోపులాటలో సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి
హైదరాబాద్, ప్రజాతంత్ర,ఆగస్ట్7: ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆల్వాల్ మహాబోధి స్కూల్ కాంపౌండ్‌లో గద్ధర్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో..బౌద్ధ ఆచారం ప్రకారం జరిగాయి. అయితే.. కడసారి చూపు కోసం భారీగా అభిమానులు వచ్చారు. పోలీసులు వాళ్లను నియంత్రించలేకపోవడంతో తోపులాట జరిగింది. తోపులాటలో కార్డియాక్ అరెస్ట్‌తో సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు…




