గణనాధుని భక్తిశ్రద్ధలతో పూజించాలి

తుర్కయంజాల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27 : విజ్ఞాలను తొలగించి, భక్తుల కోరికలను తీర్చే గణనాధుని భక్తిశ్రద్ధలతో పూజించాలని రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు నోముల దయానంద్ గౌడ్ తెలిపారు. బుధవారం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ లోని వివిధ వినాయక మండపాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ప్రోటోకాల్ సెల్ కన్వేయర్ నోముల కార్తీక్ గౌడ్, మురళి, ప్రశాంత్ కుమార్, పూర్ణ, పప్పు, ప్రశాంత్, సందీప్ , హర్షిత్, కన్ని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *