తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పట్టణంలో ప్రతిష్టించిన గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పలు మండపాల్లో ప్రతిష్టించిన గణనాథులను సందర్శించి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు ప్రశాంత వాతావరణంలో గణేశుని నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు. ప్రజలంతా క్షేమంగా ఉండాలని, వ్యాపార రంగం అభివృద్ధి దశలో కొనసాగాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, అన్ని వర్గాల వారికి మంచి జరిగేలా చూడాలని గణేశున్ని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.



