‌లంచం…అదో రోగం,

సమాజానికి పట్టిన గ్రహచారం.

ఎన్నిచట్టాలు వచ్చినా దానికి చుట్టాలే.

ఆకలితో దేబురిస్తూ

కంచం నిండితే చాలని

ఘోషిస్తున్న జనులు కొందరైతే,

లంచాలతో

కడుపునింపుకోవాలని చూసే

మరికొందరున్న నేటి సమాజంలో

తాయిలాలతో,బుజ్జగింపు ఫీట్లతో

రాజకీయం మకిలిపట్టిపోతోంది.

స్వప్రయోజనాలు తప్ప

ఏ జెండా అవసరంలేని

రాజకీయాన్ని,

డబ్బుపై వ్యామోహంతో

గుడినీ,గుడిలో లింగాన్నీ దోచే

మనస్తత్వం పుణికిపుచ్చుకొని

ఏ ఎండకాగొడుగు పడుతూ

పబ్బంగడిపే,

ఓ పార్టీపై గురితో ఓటేస్తే

గెలిచినోడ్ని కొనేసే కక్కుర్తితో

దేశమంతా నిండిన

రాజకీయ మోసగాళ్లను చూసి

ఊసరవెల్లి ఉరేసుకుంటాననడంలో

తప్పేమీ లేదుగా!

 

లంచంగడ్డితో

మకిలిపట్టిపోతోన్నజి

రాజకీయాన్ని,

గడ్డి తినే మనుషులను కని

తమకి గడ్డుకాలం దాపురించిందని

గడ్డి బెంబేలెత్తడం సమంజసమేగా!

 

ఘనత వహించిన

నేటి రాజకీయమా

నీకు నీవే సాటి,

అన్యులెవరూ లేరు

నీకు పోటీ…

– వేమూరి శ్రీనివాస్‌, 9912128967

                      ‌తాడేపల్లిగూడెం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *