పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: గడప గడపకు సంక్షేమ పథకాలు.. గ్రామ గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రతి పల్లెను ప్రగతికి ప్రతిరూపంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ 100 సీట్లు కైవసం చేసుకుంటుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని శ్రీ సిద్ధి వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అసెంబ్లీ ఎన్నికల ప్రచార రథాలను జెండా ఊపి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 60 ఏళ్లలో సాధించని ప్రగతిని 10 ఏళ్లలో చేసి చూపించడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి పల్లెను ప్రగతికి ప్రతిరూపంగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు జిమ్మిక్కులు చేసిన టిఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఆపలేరని అన్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాకున్నా తెలంగాణలో అమలు చేస్తామంటూ ప్రగాల్బాలు పలకడం ప్రతిపక్షాలకే చెల్లిందని విమర్శించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయని నమోదు చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
గడపగడపకు సంక్షేమ పథకాలు




