గజ్వెల్ మార్కెట్ కమిటీ పాలకవర్గం రాజీనామా

సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: జిల్లాలోని గజ్వెల్ మార్కెట్ కమిటీ పాలకవర్గం  రాజీనామా చేస్తున్నట్లు చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ప్రకటించారు.గజ్వెల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, డైరెక్టర్లందరితో కలిసి శనివారం రాజీనామా పత్రాన్ని సెక్రటరీ జాన్వెస్లీకి అందచేశారు. తెలంగాణా ఉద్యమ కాలం నుండి కెసిఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చిన తనకు, తన సతీమణికి రెండు పర్యాయలు మార్కెట్ కమిటీ చైర్మన్గా అవకాశం కల్పించడం పట్ల కెసిఆర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు.ఈ ముడున్నరెళ్ల కాలంలో సహకరించిన డైరెక్టర్లు సిబ్బంది వ్యాపార వర్గాలు, రైతులు, అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని ప్రజల సేవలో నిరంతరం కెసిఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తామని గజ్వెల్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పంచిన కెసిఆర్ గారికి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు.రానున్న రోజుల్లో రైతులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా ముందుండి పనిచేస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *