గజల్‌ శ్రీ‌నివాస్‌కు లతామంగేష్కర్‌ ‌పురస్కారం

గిన్నిస్‌ ‌వరల్డ్ ‌రికార్డుల గజల్‌ ‌గాయకుడు గజల్‌ శ్రీ‌నివాస్‌ ‌కు అరుదైన గౌరవం దక్కింది. ’భారతరత్న’ పురస్కార గ్రహీత లతా మంగేష్కర్‌ ‌జన్మ దినోత్సవం సందర్భంగా మై హోమ్‌ ఇం‌డియా మహారాష్ట్ర , ముమ్మారు ఆధ్వర్యంలో సంగీత సామ్రాజ్ఞి లతా మంగేష్కర్‌ ‌స్మ•తి పురస్కారం జ్ఞాపికతో పాటు రూ.21,000 వేల పురస్కార పారితోషికాన్ని అందజేయడం జరిగింది.

Read Here: ‌బ్రహ్మపుత్రలో పడవ బోల్తా – ఏడుగురు గల్లంతు

పుణెళి నగరంలో శ్రీ యశ్వంత్‌ ‌రావు చవాన్‌ ఆడిటోరియంలో వేలాది మంది సమక్షంలో గజల్‌ శ్రీ‌నివాస్‌కు విశ్వ విఖ్యాత మరాఠీ కళాకారుడు ప్రశాంత్‌ ‌దామ్లే ఈ అవార్డ్‌ను అందజేశారు. ఈ కార్యక్రమానికి సునీల్‌ ‌దేవదర్‌ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో డా.గజల్‌ శ్రీ‌నివాస్‌.. ‌లతా మంగేష్కర్‌పై రాజేంద్ర నాథ్‌ ‌రెహబర్‌, ‌కల్నల్‌ ‌తిలక్‌ ‌రాజ్‌, ‌రవికాంత్‌ అన్మోల్‌ ‌రచించిన హిందీ, ఉర్దూ గజల్స్‌ను గానం చేసి ఆమెకు గాన నీరాజనం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *