గంటకోసారి చూసుకోవాల్సి వస్తోంది

గంటకోసారి చూసుకోవాల్సి వస్తోంది!
ఏ నాయకుడు ఏ రంగు కండువా
మార్చాడోనని?

గంటకోసారి చూసుకోవాల్సి వస్తోంది!
ఏ పార్టీ ఏ కూటమితో జత కట్టిందోనని?
గంటకోసారి చూసుకోవాల్సి వస్తోంది!
ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీలో
ఉన్నారోనని?

గంటకోసారి చూసుకోవాల్సి వస్తోంది!
ఏ పార్టీ సభకు ఏ రోజు అమ్ముడు
పోవాలోనని?
గంటకోసారి చూసుకోవాల్సి వస్తోంది!
ఏ నాయకుడి చావు ఏ పార్టీకి సింపతీ
తెస్తుందోనని?

గంటకోసారి చూసుకోవాల్సి వస్తోంది!
ఏ కులపోడి వోట్లు ఏ పార్టీ వైపు
మొగ్గుతున్నాయోనని?

గంటకోసారి చూసుకోవాల్సి వస్తోంది!
ఏ పార్టీ ఏం కొత్త ఉచిత పథకాలు
ప్రకటించిందోనని?

గంటకోసారి చూసుకోవాల్సి వస్తోంది!
అధికారపక్షమా?లేక ప్రతిపక్షంలో ఉన్నామా యని?

కానీ
నిముషానికోసారి చూసుకోవాల్సి వస్తోంది!
అసలు వోటు ఉందో? ఊడపీకేసారేమోనని?
      – ఉషారం, 9553875577

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *