గంజాయి తరలిస్తున్న స్మగ్లర్ అరెస్ట్

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 18 : ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 12 కిలోల గంజాయి, దీని విలువ ( మూడు లక్షలు) ఉంటుందన్నారు. ఒక సెల్ ఫోన్, స్వాధీనపరచుకున్నట్లు ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై బలరాం నాయక్ తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 17న మంగళవారం విశ్వనీయ సమాచారం మేరకు మూడు గంటల ప్రాంతంలో ఆమనగల్లు సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై కె. బలరామ్, తన పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండగా ఆర్టీసీ బస్సులో మంచిర్యాల జిల్లా బాబు క్యాంప్, బెల్లంపల్లి గ్రామానికి చెందిన బైరి శ్రీనివాస్ 12.531 కిలోల గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారని వారు తెలిపారు. వైజాగ్ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన శ్రీలత నుండి కొనుగోలు చేసినట్లు వారు వివరించారు. పట్టుబడ్డ గంజాయిని కర్నాటక రాష్ట్రం బెంగుళూరుకు చెందిన ఉమేష్‌కు విక్రయించడానికి హైదరాబాద్ నుండి ఆమనగల్లు మీదుగా బెంగళూరు వైపు ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా పట్టుకున్నట్లు సీఐ వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం కు చెందిన శ్రీలత, కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన ఉమేష్ లు పరారీలో ఉన్నారని సిఐ తెలిపారు. నిందితుడు బైరి శ్రీనివాస్ భారీ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో నిరుపేదలకు అక్రమంగా గంజాయిని విక్రయిస్తూ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడని.. ఎప్పటిలాగే విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి పాడేరు పరిధిలోని మద్దిగురువు వద్ద శ్రీలతను కలుసుకుని సుమారు 12.531 కిలోల గంజాయిని కొనుగోలు చేసి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ నుంచి ఆమనగల్లు మీదుగా బెంగుళూరుకు వెళ్లి విక్రయించే వాడన్నారు. దీని మొత్తం విలువ రూ. 3,13,275/- గా ఉంటుందని వారు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి గంజాయి తరలిస్తున్న నిందితున్ని పట్టుకోవడంలో ఆమనగల్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జె.వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్సై శ్రీకాంత్, పిసి జాన్సన్, ఎస్‌ఓటి శంషాబాద్ జోన్‌కు చెందిన సురేష్, పిసి మరియు టీమ్ & కె. బలరాం పోలీసు సిబ్బంది, శంషాబాద్ డిసిపి కే. నారాయణ రెడ్డి, అదనపు శంషాబాద్ జోన్ డిసిపి రామ్ కుమార్, ఎస్ ఓ టి, డి సి పి రషీద్, అదనపు ఎస్ఓటి, డిసిపి నారాయణ గౌడ్, షాద్‌నగర్‌ డివిజన్‌ ​​ఎసిపి ఎన్‌.సిహెచ్‌.రంగస్వామిలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *