- కరెంట్ కావాల్నా…కాంగ్రెస్ కావాల్నా ఆలోచించాలి
- జన్నారం ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.
- జనసంద్రంతో గులాబీ మయంగా మారిన జన్నారం
జన్నారం, ప్రజాతంత్ర, నవంబర్ 17 : ఖానాపూర్ నియోజకవర్గం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మంత్రి కెటిఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమైక్య రాష్ట్రంలో వెనుకబడ్డ ఖానాపూర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని సిరిసిల్ల నియోజకవర్గం మాదిరిగా అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. జన్నారం మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ మాట్లాడుతూ….24 గంటలు కరెంటు ఇచ్చే బిఆర్‌ఎస్ కావాల్నా, మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కావాల్నా అని సబికులను ప్రశ్నించారు దీనితో 24 గంటల కరెంటు ఇచ్చే బిఆర్‌ఎస్ ప్రభుత్వం కావాలని జనం ఉత్సాహంగా బదులిచ్చారు. ఇన్ని రోజులు రానివారు ఇప్పుడు ఓట్లు అడగడానికి మీ ముందుకు వస్తారు కానీ ఆలోచించి, ఆగం కాకుండా కారు గుర్తుకే ఓటు వేసి జాన్సన్ నాయక్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
కెసిఆర్ చచ్చుడో-తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో 2014లో కేసీఆర్ సబ్బండ వర్ణాల అందరి సహకారంతో కొట్లాడడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి రాష్ట్రాన్ని దొంగల చేతిలో పడతామ. ఆనాడు కరెంటు ఉంటే వార్త ఈనాడు కరెంటు పోతే వార్త కాంగ్రెస్ హయాంలో ఎరువులు విత్తనాల దుకాణాల ముందు చెప్పులు లైన్లో నుంచి పడిగా పూలు కాసిన రోజులవి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలాంటి పరిస్థితి లేదని అన్నారు. అలాంటి కాంగ్రెస్ వాళ్లు సిగ్గు లేకుండా ఓట్లడానికి ఎలా వస్తారు 24 గంటలు కరెంటు లేదని చెప్తున్నా కాంగ్రెస్ వాళ్లు ఏ గ్రామానికి అయినా వెళ్లి కరెంటు తీగలు పట్టుకొని చూడండి. దేశానికి పట్టిన దరిద్రం పోతుందని అన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అభివృద్ధి చేస్తామని చెప్తున్న కాంగ్రెస్ వాళ్లకు 55 సంవత్సరాలు, 11 సార్లు అవకాశం ఇచ్చినప్పుడు మంచినీరు, త్రాగునీరు, సాగునీరు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ,కేసీఆర్ కిట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఆనాడు 200 పెన్షన్ ఇవ్వడానికి గోస పెట్టారు, అలాంటివారు ఇప్పుడు 4000 పెన్షన్ ఇస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారు. కెసిఆర్ గొంతు నొకడానికి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి కానీ ఎంతమంది వచ్చినా ప్రజల మీద నమ్మకం తోనే ముందుకు సాగుతున్నామని అన్నారు. 70 లక్షల రైతులకు 73 వేల కోట్లు రైతుల ఖాతాలో వేసిన ఘనత కేసీఆర్ ది అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం కృషి చేసింది టిఆర్‌ఎస్ ప్రభుత్వం అని అన్నారు 29 లక్షల మందికి నెలకు రెండు వందల రూపాయల చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే ప్రస్తుతం మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 29 లక్షల పెన్షన్లను 46 లక్షలకు పెంచి ఘనత కేసిఆర్ కి దక్కుతుందన్నారు. కడం ప్రాజెక్టు సామర్థ్యం పెంచి 12 గేట్లు ఏర్పాటు చేయడానికి 600 కోట్లు ఖర్చు అవుతుందని అది నా బాధ్యత అని అన్నారు. శాతం పూర్తి చేసింది కేసీఆర్ అని గుర్తు చేశారు. జన్నారం మండల కేంద్రంలో సెంటర్ లైటింగ్, సైడ్ డ్రైనేజ్, 132కెవి సబ్స్టేషన్ ,ఐటిఐ కళాశాల పక్కా భవనం, రోటి కూడా తపాలాపూర్ మధ్యన వాగుపై వంతెన, సోనాపూర్ తండా నుండి లోతొర్రె మధ్యలో వంతెన ,గురుకుల కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలని జాన్సన్ నాయక్ నా దృష్టికి తీసుకు వచ్చారని, జాన్సన్ నాయక్ ను మీరు బారీ మెజారిటీ తో గెలిపించుకుంటే ఈ పనులన్నీ ఇచకచగా పూర్తయితాయని అన్నారు.
అంతేకాకుండా 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా కవ్వాల్ టైగర్ జోన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి తీసుకు వచ్చాడని ఆ సమస్యను కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 18 ఏళ్లు నిండిన మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద ?3,000, ఆసరా పెన్సలను 2000 నుండి విడుతలవారీగా 5000 వరకు, గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకు, తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ సన్న బియ్యం, ఐదు లక్షల జీవిత బీమా, అలాగే అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని తెలిపారు. ఎలాంటి ఆశ లేని కానాపూర్ నియోజకవర్గానికి సేవ చేయడానికి ముందుకు వచ్చిన జాన్సన్ నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నంత సేపు మంత్రి కేటీఆర్, జాన్సన్ నాయక్ నినాదాలతో ప్రజా ఆశీర్వాద సభ మారుమోగిపోయింది. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు చారులత రాథోడ్ తోటి సంఘం జిల్లా అధ్యక్షుడు పెంద్రం రాజేష్ ఏబీవీపీ జిల్లా నాయకుడు కొండపల్లి మహేష్ వైఎస్సార్ టి.పి రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు సిరికొండ లక్ష్మి లతోపాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు టిఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అవకాశం ఇవ్వండి-అభివృద్ధి చేసి చూపిస్తా..: బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్
ఒక్క అవకాశం ఇవ్వండి ఖానాపూర్ నియోజకవర్గం వర్గాన్ని అన్ని రంగాలలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి చేసి చూపిస్తానని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ అన్నారు. జన్నారం మండల కేంద్రంలో శుక్రవారం రోజు ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ నాకు ఎలాంటి ఆశ లేదని నేను గెలిచిన ఓడిన ప్రజల మధ్యలో ఉంటానని ఖానాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి కోసం ప్రాణాలైనా అర్పిస్తానని అన్నారు. జన్నారం మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్, సైడ్ డ్రైనేజ్ 132 కేవీ సబ్ స్టేషన్, ఐటిఐ కళాశాల పక్కా భవనం, తపాలాపూర్ రోటి గూడ మధ్యలో వాగుపై వంతెన, సోనాపూర్ నుండి లోతొర్రె గ్రామాల మధ్యలో వాగుపై వంతెన, గురుకుల కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అలాగే కవ్వాల్ టైగర్ జోన్ తో ప్రజలు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విట్టల్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, మంచిర్యాల జిల్లా ఎంపీ వెంకటేష్ నేత, మాజీ పీసీసీ సభ్యులు పైడిపల్లి రవీందర్రావు, సీనియర్ నాయకులు వేణుగోపాల్ చారి గడ్డం అరవింద్ రెడ్డి పూర్ణచందర్ నాయక్ జెడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్ ఎంపీపీ వైస్ ఎంపీపీలు మాదాడి సరోజన సుతారి వినయ్ టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుర్రం రాజారాంరెడ్డి సులువ జనార్ధన్ పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జక్కు భూమేష్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు ,సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు,ప్రాజెస్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





