ఖానాపూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక 

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 9: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్ అన్నారు.మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామం నుండి దాదాపు 90 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్ధి పామేన భీం భరత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి కండువా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతుందన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై ప్రజలకు నమ్మకం కలిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు.పార్టీలో చేరిన నాయకులకు కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎస్ పాండురంగారెడ్డి,ఎస్ శ్రీనివాస్ రెడ్డి,ఎస్ వీరారెడ్డి,ఎస్ నరసింహారెడ్డి, సి శ్రీనివాస్ రెడ్డి, ఎన్ మల్లారెడ్డి,కె తిరుపతి రెడ్డి,ఎస్ ఎల్లారెడ్డి,ఎస్ విట్టల్ రెడ్డి,మాజీ వార్డు సభ్యుడు బి సంజీవయ్య,కె శ్రీకాంత్ రెడ్డి,పి శ్రీనివాస్ రెడ్డి,ఎస్ రామచంద్రారెడ్డి, ఎస్ వెంకట్ రెడ్డి,సామ అమర్నాథ్ రెడ్డి,రంగాపురం శ్రీనివాస్,ఎన్ చంద్రశేఖర్ రెడ్డి,సిహెచ్ వెంకటేష్, పి మహేశ్వర్ రెడ్డి,సి చంద్రారెడ్డి,ఎస్ విట్టల్ రెడ్డి,సిహెచ్ రాఘవేందర్ రెడ్డి,జె భోజిరెడ్డి,జి రాజు,పి ప్రదీప్ కుమార్,ఖానాపూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *