ఖబడ్దార్ బీజేపీ ఎంపీ సోయంబాబు రావు : లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట కార్యదర్శి గోవింద్ నాయక్

పరిగి, ప్రజాతంత్ర, జూలై 28: ఖబడ్దార్ బీజేపీ పార్టీ ఎంపీ సోయం బాబురావు అని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట కార్యదర్శి గోవింద్ నాయక్ హెచ్చరించారు.శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో విలేకరులతో మాట్లాడుతూ… తెలంగాణను మరో మణిపూర్ గా మార్చాలని భారతీయ జనత పార్టీ చూస్తున్నది అని, కలిసిమెలిసి జీవిస్తున్న గిరిజన ప్రజల మధ్యలో చిచ్చుపెట్టి మరొకసారి రాజకీయంగా ప్రయోజనాలు పొందాలనీ ఆలోచన చేస్తుందని, ఎంపీ సోయం బాబురావు కేంద్రమంత్రికి బంజారా లంబాడి బిడ్డలను గిరిజనుల జాబితా నుండి తొలగించాలని లేఖ రాయడం జరిగింది అని,దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. నీ వెనుక ఉన్న భారతీయ జనతా పార్టీ అంతు చూస్తాం,బంజారా పవర్ ఏంటో చూపిస్తాం అని అన్నారు.రానున్న రోజుల్లో బిజెపి పార్టీ నాయకులని ఏ తండాలో తిరగనీయం అని, సిగ్గు,శరం ఉన్న బిజెపి పార్టీలో ఉన్న బంజారా (లంబాడి) నాయకుల్లారా ఇకనైనా మేల్కొని రాజీనామా చేయండి అంటూ వ్యాఖ్యానించారు, బంజారా బిడ్డల వైపు నిలబడండి లేకుంటే మిమ్మల్ని తండా నుంచి తరిమి తరిమి కొడతారు అంటూ హెచ్చరించారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీనిపైన స్పందించి సమాధానం ఇవ్వాలి, లేదంటే లక్షలాది మందితో లంబాడి ప్రజలు బిజెపి రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *