క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 18: క్రీడల దినచర్యలో భాగం కావాలని, క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో కేబీఎన్  యంగ్ స్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని కోరారు. పటాన్ చెరు నియోజకవర్గంలో క్రీడారంగం అభివృద్ధికి పెద్ద పీట వేయడంతో పాటు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వీటితోపాటు పటాన్ చెరు, అమీన్ పూర్, జిన్నారం లలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర జాతీయ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు సైతం సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్,  మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *