క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న సర్పంచ్ ఎల్ ఎన్ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 25 : కడ్తాల మండల కేంద్రంలో సొమవారం  క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని  అడోనై కృపా ప్రార్థన మందిరం, యెహోనా మిస్సి మినిస్ట్రీస్ ప్రార్ధనా మందిరాలలో  క్రైస్తవులు  ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గ్రామ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు ఆలపించిన గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అంతకు ముందు చర్చిలో క్రిస్మస్ సందేశం ప్రజలకు అందించారు.ఈ కార్యక్రమంలో పాస్టర్లు డేవిడ్రాజు, సోఫియా బేగం, యోబు దినకర్, మణికుమార్,  రవీందర్, మహేందర్, మంగళపల్లి నరసింహ, 14. వార్డు నెంబర్ రామచంద్రయ్య, రాజు, శ్రీను, నవీన్, మూర్తి, వెంకటేష్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *