క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: బి  .ఏన్.రెడ్డి.నగర్ డివిజన్ లొని శ్రీ కృష్ణ దేవరాయనగర్ వున్న లుదారన్ చర్చి నందు క్రిస్మస్ పండుగ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా  సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి క్రిస్మస్ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని,ఆ యేసు క్రీస్తు కృప ప్రజలందరిపై ఉండాలని,ప్రజలు ఎల్లపుడూ సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు.అనంతరం పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఇట్టి కార్యక్రమంలో బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ భారస పార్టీ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి,గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ సభ్యులు అనిల్ చౌదరి,రాఘవేంద్రరావు,న్యూటన్ మరియు చర్చి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు,దైవ సేవకులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *