క్రిస్టియన్ మైనార్టీస్ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలి.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, తెలంగాణ ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి ఏదైనా యూనిట్‌ని స్థాపించడానికి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద 100% సబ్సిడీ ఆర్థిక సహాయం గురించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి ఒక ప్రకటనలో తెలియజేశారు.  అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు  వార్షిక ఆదాయం అర్బన్‌లో సంవత్సరానికి 2.00 లక్షలు & గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు కలిగి ఉండాలన్నారు.  వయస్సు 21 నుండి 55 సంవత్సరముల లోపు, దరఖాస్తు దారుడు BC-C కుల దృవికరణ పత్రం సమర్పించవలసి ఉంటుందన్నారు. చర్చి ద్వారా జారీ చేయబడిన Baptism Certificate  సమర్పించవలెను దరఖాస్తులు www.tsobmms.cgg.gov.in లో ఆన్ లైన్ ద్వారా ఈనెల 14 వరకు సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలాని తెలియజేశారు.మరిన్ని వివరాల కోసం సంబంధిత జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి, వికారాబాద్ లెదా MD-TSCMFC, Hyderabad 9440685713 కు సంప్రదించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *