సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: సిద్దిపేట బైరి అంజయ్య మినీ ఫంక్షన్ హాల్ లో మిషన్ కమ్యూనికేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ…ప్రతి మనిషి నిత్య విద్యార్ధి నే… ఎదో చేయాలి అనే తపన లక్ష్యం ఉండాలి.
ఎదో ఒకటి నేర్చుకోవాలి అనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలి. నేను ఒక్కడినే బ్రతకాలి అని కాదు.. నాతో పాటు పది మంది కి సహాయం చేస్తా అనే శ్రీకాంత్ తపన కు హ్యాట్సఫ్.సాంకేతికతను అందిపుచ్చుకొని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగ ఇంటర్వ్యూ లు, ఇతర ఇంటర్వ్యూ లో సమాధానం చెప్పలేక ఆందోళన చెందుతారు. సూటిగా చెప్పేలేక… వ్యక్త పరచలేక కమ్యూనికేషన్ లేక తడపడుతాం.అలాంటి తడపాటు లేకుండా ఉన్నత స్థాయి లో ఉండాలి కోట శ్రీకాంత్ ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాడు.తాను చదువుకున్న చదువు నలుగురికి ఉపయోగ పడాలి.. నేటి తరం విద్యార్థులకు ఉపయోగ పడాలని శ్రీకాంత్ చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పది.
చాలా మంది గొప్ప చదువులు చదువుతారు.. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల వెనకబడి పోతున్నారు. సమాజంలో వస్తున్న మార్పులను ఆకలింపు చేసుకోవాలి..కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి.
మిషన్ కమ్యూనికేషన్ సంస్థ పేద విద్యార్థుల కు, ప్రభుత్వ పాఠశాల ల్లో చదువుతున్న విద్యార్థులకు అందించే శిక్షణ కు అన్నిరకాలుగా సహకారం అందిస్తా మని అన్నారు.





