కౌంట్‌  ‌డౌన్‌..16.‌ ప్రజా‘తంత్రం’

దండోరా దండుకి కమలం భరోసా
మోదీ  ప్రకటనతో వర్గీకరణపై ఆశ
తాజా ఘటన పట్ల విపక్షం విమర్శ
అంతా ఓ బూటకమని రుసరుస

ఎలక్షన్‌ ‌దారిలో సెలక్షన్‌ ‌పైనే ధ్యాస
అనేక పార్టీల వైఖరిలో ఇదే మూస
ఏంచేసినా జనం అడగరని దిలాసా
ఎన్నిసార్లు మోసపోతావే మనసా?
    – వి.రమేష్‌ ‌బాబు
నామినేషన్డ్ల పరిశీలన ముగిసింది … 2898 మంది అభ్యర్థులు బరిలో నిలువగా .. బీఆర్‌ ఎస్‌ అధినేత పోటీలో ఉన్న  గజ్వెల్‌ ‌లో అత్యధికంగా 114 మంది బరిలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీలు పక్కపక్క నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాయి. కాంగ్రెస్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలోని స్టేషన్‌ ‌ఘనపూర్‌, ‌వర్ధన్నపేట నియోజకవర్గాల్లో పాల్గొనగా, రాష్ట్ర ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌పాలకుర్తి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్‌ ఎస్‌ అధినేత ,ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు నాగార్జున సాగర్‌, ఇ‌బ్రహీంపట్నం నియోజక వర్గాల బహిరంగ సభల్లో కూడా పాల్గొన్నారు. కేసీఆర్‌ ‌ప్రతి సభలో రైతు బంధు, ధరణి, ఉచిత విద్యుత్‌ ‌ను కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారం లోకి వొస్తే రద్దు చేసే ప్రమాదముందని ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి కామారెడ్డి నియోజక వర్గంలో కూడా పర్యటించారు. నిరుద్యోగం, రైతు ఆత్మహత్యలు , బీఆర్‌ ఎస్‌ ‌పార్టీ ది  అవినీతి పాలన అంటూ  ప్రజలకు వివరించే ప్రయత్నం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *