తెలంగాణలో హోరాహోరీ రణం
పండుతోంది రాజకీయ చాణక్యం
చోద్యం చూస్తున్నది ప్రజానీకం
మైకం కమ్మిందో మునగడం తథ్యం
పరాకులో పడితే బతుకంతా ఆగం
వోటు చేజారితే మిగిలేదంతా ఖేదం
సూత్రధారులెవరో గ్రహింపు ముఖ్యం
అప్రమత్తతే నేర్వాల్సిన నేటి పాఠం
– వి.రమేష్ బాబు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా నల్లగొండ విజయ భేరీ సభలో పాల్గొన్నారు.సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముగ్గురు తోడు దొంగలేనని ఖర్గే వ్యాఖ్యానించారు. బిజెపితో దేశానికి ఒరిగిందేవిరీ లేకపోగా తీవ్ర అన్యాయాలు జరుగుతున్నాయని అన్నారు. బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తాండూరు,కొడంగల్,మహబూబ్ నగర్ మరియు పరిగి నియోజక వర్గ ప్రజాఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు.తెచ్చుకున్న తెలంగాణను ఆగం కానీయొద్దు..అభివృద్ధిని సగంలనే ఆగిపోయినీయొద్దు అని ప్రజలకు బిఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ హెచ్చరించారు.రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిజామాబాద్,నారాయణ్ ఖేడ్,గజ్వెల్ కాంగ్రెస్ విజయ భేరీ సభల్లో, బాలానగర్, కూకట్ పల్లి నియోజక వర్గాల్లో రోడ్ షో ల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బక్కటోడేమీ కాదనీ, బకాసురుడని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఓడి ఎర్రవెల్లి పామ్ హౌస్‌లో కూర్చున్నా కూడా సిఎం హోదాను అడ్డుపెట్టుకుని అక్రమంగా దోచుకున్న లక్ష కోట్ల రూపాయలను వసూలు చేయడమే కాదూ,హైదరాబాద్ నగరం చుట్టూ అక్రమంగా కేసీఆర్ కుటుంబం ఆక్రమిం చుకున్న 10 వేల ఎకరాల భూములను కూడా లాక్కుంటామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పని చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అవకాశం ఇవ్వరని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొస్తే ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి మారుతారని కిషన్ రెడ్డి అన్నారు .బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి సూర్యాపేట నియోజక వర్గ బహిరంగ సభలో పాల్గొన్నారు, ప్రజారాజ్యం అధ్యక్షుడు వరంగల్ లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల