కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రశాంత్ జే. పాటిల్ 

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: శాసనసభ సాధరణ ఎన్నికల ప్రక్రియలో  భాగంగా   సిద్దిపేట పట్టణంలోని ఇందూరు కళశాలలో దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, సిద్దిపేట, నియోజకవర్గలకు కేటాయించిన బ్లాక్ లలో ఈనెల 3న జరగబోయే ఓట్ల లెక్కింపు నకు కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటు పనులను క్షేత్రస్థాయిలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ పరిశీలించారు. ఎలక్షన్ కమీషన్ ఆప్ ఇండియా మార్గదర్శకాలు ప్రకారం కౌంటింగ్ సెంటర్లలో కౌంటర్లు ఏర్పాట్లు, కౌంటింగ్ సూపర్వైజర్లు విధులు నిర్వహణ ప్రక్రియకు ఏర్పాట్లు, కౌంటింగ్ ఏజెంట్లు సిట్టింగ్ ఏర్పాట్లు మైదానంలో నుండి బ్లాక్ల లోపలీకీ వేరువేరుగా  సూపర్వైజర్, కౌంటింగ్ ఏజెంట్లు వెళ్ళే మార్గాలలో బాంబో బారికెడ్ ఏర్పాటు చెయ్యాలని తెలిపారు. వాహనాల పార్కింగ్ సౌకర్యం కౌంటింగ్ ఏజెంట్లకు కౌంటింగ్ సూపర్ వైజర్లకు వేరువేరుగా ఏర్పాటు చేయాలి. మైదానంలో మీడియా పాయింట్ ఏర్పాటు, ఎన్నికల్లో విధిని నిర్వహించే ప్రతి ఒక్కరికి భోజన సౌకర్యం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఏజెన్సీలకు తెలిపారు.కలెక్టర్ వెంట దుబ్బాక సిద్దిపేట హుస్నాబాద్ గజ్వేల్  ఆర్వోలు, గరిమా అగ్రవాల్, రమేష్ బాబు, బెన్ షాలం, బన్సిలాల్, నిర్మాణ ఏజెన్సీలు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *