కోరమీసం

పసిప్రాయపు చివరి అంకంలో
పొడుచుకు వచ్చింది రోషంలా!
పౌరుషానికి తానొక్కటే  ప్రతీకలా!

ఎదురు వచ్చిన యుక్తవయస్సులో
ఎదిగింది ఏపుగా దర్భ గడ్డిపొదలా!
మెలికల కసరత్తులు చేసి మిగిలింది
వంపులు తిరిగిన మల్లయోధుడిలా!

నల్లటి గుబురుపొదల మధ్య విరిసిన
మగడి  నవ్వు చూసి అమ్మడి
గుండెల్లో సరస సరగాలు గుబులయ్యితే!

సంపుటాల సంకుల సమరంలో,
మెత్తటి అధరాలను గుచ్చి గుచ్చి
చంపుతోంది తన నాటు సరసంతో!

ఒకడు సంపెగ నూని రాసి షోకు తెస్తే
ఇంకొకడు నిమ్మ నూనె పూసి
నిగారింపు తెచ్చాడు!

వీర మరణం పొందే సిపాయి
మోముతోనే దాని అందం!
అన్నదాత కర్షకరాజు సిరి
నగవు తోనే దాని చందం!

కోరగా దువ్వితే సన్మానం
అరగా గీకితే అవమానం!

చేవ చచ్చిన ముఖంపై మెలితిప్పినా
నీటి రొయ్యకు చాంతాడంత ఉన్నా!
తలవంచిన జీవచ్చవంలా
తెగి ఊడిన తలకాయలా!
ఏడవలేక ఎబ్బెట్టుగా మిగుల్తుంది
సిగ్గు పోయి సగం చచ్చిపోతుంది!
  -ఉషారం
                9553875577

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *