- మాణిక్ రావు థాక్రేతో ఎంపి కోమటిరెడ్డి భేటీ
- ఎన్నికలపై చర్చించామని కోమటిరెడ్డి వివరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో వెంకట్ రెడ్డిని కలవాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే ఆదేశించారు. దీంతో బుధవారం ఉదయం ఎమ్మేల్యే క్వార్టర్స్‌లో థాక్రేతో వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. కోమటిరెడ్డి చేసిన కామెంట్స్‌ను థాక్రే వీడియో క్లిప్పింగ్ చూశారు. కోమటిరెడ్డి మాటలను ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేయించుకున్నారు. కోమటిరెడ్డి వివరణ తర్వాత థాక్రే ఏఐసీసీకి రిపోర్టు ఇవ్వనున్నారు. థాక్రేతో భేటీ అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వి•డియాతో మాట్లాడుతూ నిన్నటి తన వ్యాఖ్యలపై చర్చ జరగలేదన్నారు. నిన్నటి తన వ్యాఖ్యలను బోసు రాజు థాక్రేకు వివరించారని చెప్పారు. వి•డియాలో తన వ్యాఖ్యలు తప్పుగా ప్రచారం చేశారన్నారు. థాక్రే తన వ్యాఖ్యలను లైట్‌గా తీసుకున్నారన్నారు.
తమ పార్టీ వాళ్లు..ఆ వీడియో పూర్తిగా చూడలేదని..ఓ సర్వే రిపోర్ట్ వివరాలను మాత్రమే మాట్లాడానని వివరించారు. ఎన్నికలకు ఏవిధంగా సిద్ధం కావాలి అనే దానిపై కూడా థాక్రేతో చర్చించానని కోమటిరెడ్డి తెలిపారు. ముందస్తుగా టికెట్లు ఇవ్వాలని, గెలిచే వాళ్లకు టికెట్ ఇవ్వాలని కోరానని, గతంలో ఆలస్యంగా టికెట్ల అనౌన్స్ చేయడం వల్లే.. గోల్కొండ హోటల్లో గొడవలు జరిగాయన్నారు. తెలుగుదేశంతో పొత్తు వద్దని చెప్పానన్నారు. తన పాదయాత్ర ఈనెల ఆఖరులో ఉంటుందని, భువనగిరిలో మొదలు పెడతానని స్పష్టం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండలో మొదలు పెడతారన్నారు. ఖమ్మంలో కూడా యాత్ర చేస్తామన్నారు. గ్రామాల్లో బైక్ యాత్ర చేస్తామని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని ఎంపీ కోమటిరెడ్డి స్పష్టం చేశారు.




