– ఎకరం ధర రూ.137.25 కోట్లు
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబరు 24: హైదరాబాద్ కోకాపేటలో ప్లాట్లు రికార్డు ధర పలికాయి. నియోపోలిస్ దగ్గర రికార్డు స్థాయిలో ప్లాట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఎకరం ధర రూ.137.25 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. గత రికార్డులను ఇది తిరగరాసింది. అధికారులు ప్లాట్ నెంబర్ 17, 18కి ఈ వేలం నిర్వహించారు. అధికారిక సమాచారం ప్రకారం.. ప్లాట్ నెం. 17లో 4.59 ఎకరాలు ఉండగా ఈ వేలంలో ఎకరానికి రూ. 136.50 కోట్లు పలికింది. ప్లాట్ నెం 18లో 5.31 ఎకరాలు ఉండగా ఎకరానికి రూ.137.25 కోట్లు పలికింది. వేలంలో 9.90 ఎకరాలకుగాను ఊఓఆంకి రూ.1,355.33 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. కోకాపేటలో మిగిలిన భూములను నవంబర్ 28వ తేదీన అధికారులు వేలం వేయనున్నారు.
కాగా, నియోపొలీస్ లేఅవుట్‌లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్ద ఎత్తున పోటీపడుతున్నాయి. అంతేకాకుండా, ఇక్కడ ఎన్ని అంతస్తులు నిర్మించాలన్నదానిపై పరిమితి కూడా లేదని తెలుస్తోంది. ప్లోర్స్ విషయంలో లిమిట్ లేకపోవడంతో కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు నిర్మించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ అటు ఓఆర్‌ఆర్‌కు ఇటు రాయదుర్గం ఐటి కంపెనీలకు దగ్గరగా ఉండటంతో కోకాపేట భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.




