కొరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం

  • హాస్పిటళ్లలో మాక్‌ ‌డ్రిల్‌
  • ‌దిల్లీలో పరిశీలించిన కేంద్రమంత్రి మాండవీయ
  • హైదరాబాద్‌ ‌గాంధీ హాస్పిటల్‌లో అధికారుల పరిశీలన

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 27 : ‌కోవిడ్‌ ‌కలవరం మళ్లీ మొదలైన నేపథ్యంలో..మంగళవారం దేశవ్యాప్తంగా హాస్పిటళ్లలో మాక్‌ ‌డ్రిల్‌ ‌చేపట్టారు. ఒకవేళ కేసులు పెరిగితే అప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి హాస్పిటళ్లన్నీ సంసిద్ధం అవుతున్నాయి. కొరోనా వైరస్‌ ‌మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మహమ్మారి కట్టడి చర్యలు తీసుకుంటున్నాయి. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని నిర్ణయించిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కోవిడ్‌ ‌సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్‌ ‌డ్రిల్‌ ‌నిర్వహిస్తున్నాయి.

దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌హాస్పిటళ్లలో మాక్‌ ‌డ్రిల్‌ ‌కొనసాగుతుంది.. ఆరోగ్య సౌకర్యాలు, ఐసోలేషన్‌ ‌బెడ్లు, ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు, డాక్టర్లు, నర్సులు, ఆయుష్‌ ‌డాక్టర్లు, ఫ్రంట్‌లైన్‌ ‌వర్కర్ల లభ్యత.. అలాగే అంబులెన్సు, పరీక్షా పరికరాలు, అవసరమైన మందులు తదితర అంశాలపై సవి•క్షిస్తున్నారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో ఆరోగ్య మంత్రులు హాస్పిటళ్లలో వైద్య సదుపాయాలు, ఐసోలేషన్‌ ‌పడకల సామర్థ్యం, ఐసీయూ, వెంటిలేటర్‌ ‌పడకల లభ్యతను సవి•క్షిస్తున్నారు. అందుబాటులో ఉన్న వైద్య సిబ్బందిపై దృష్టి సారించారు. చైనా, జపాన్‌ ‌సహా వివిధ ప్రపంచదేశాల్లో కొరోనా వైరస్‌ ‌విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అలర్ట్ ‌చేసింది.

దీంతో ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కునేందుకు వీలుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలలో నిర్థారణ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొన్ని రాష్ట్రాలు మాస్కులను తప్పనిసరి చేశాయి. దిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్‌ ‌మాండవీయ మాక్‌ ‌డ్రిల్‌ను పర్యవేక్షించారు. నగరంలోని సఫ్దర్‌జంగ్‌ ‌హాస్పిటల్‌లో మంత్రి మాండవీయ పరిశీలించారు. ఇలాంటి డ్రిల్‌ ‌చేపట్టడం వల్ల మనం ఎంత వరకు సంసిద్ధంగా ఉన్నామో తెలుస్తుందని, ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకునే వీలవుతుందని మంత్రి మాండవీయ తెలిపారు.

హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లోనూ మంగళవారం కోవిడ్‌ ‌మాక్‌ ‌డ్రిల్‌ ‌నిర్వహించారు. కోవిడ్‌ ‌పేషెంట్లు పెరిగితే అప్పుడు ఎలాంటి చికిత్సను అందించాలో హాస్పిటల్‌ ‌సిబ్బంది సిద్ధం చేశారు. ఎంత వరకు సంసిద్ధంగా ఉన్నామో పరిశీలన చేసుకుంటున్నామని హాస్పిటల్‌ అధికారులు  తెలిపారు. డ్రిల్‌లో భాగంగా కీలకమైన ఆరోగ్య సౌకర్యాల గురించి పరిశీలించనున్నారు. ఐసోలేషన్‌ ‌బెడ్స్ ఎన్ని ఉన్నాయి, ఆక్సిజన్‌ ‌సపోర్ట్ ‌బెడ్స్, ఐసీయూ బెడ్స్, ‌వెంటిలేటర్‌ ‌సపోర్టెడ్‌ ‌బెడ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *