- ప్రపంచానికి మందు అందించింది ..
- గొప్ప టాలెంట్ ఉన్న రాష్ట్రం
- ఓ కుటుంబం చేతిలో బందీ …
- కెసిఆర్‌ను ఓడించేందుకు మహిళలు ముందుకు రావాలి
- కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు రెండూ ఒక్కటేనని గుర్తించండి
- ఎన్‌డిఏలో చేరుతానని కెసిఆర్ నాతో అన్నారు
- నిజామాబాద్ ప్రజాగర్జన వేదికగా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
నిజామాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 :తెలంగాణ ప్రజల్లో చాలా టాలెంట్ ఉందని, కొరోనాకు మందు కనిపెట్టారని అన్నారు. ఇక నిజాం నవాబులు హైదరాబాద్‌ను వదలకపోతే ఒకే ఒక్క గుజరాతీ బిడ్డ వల్లబాభాయ్ పటేల్ వారిని తరిమేశారని మంగళవారం నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన జనగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ గుర్తు చేశారు. ఇప్పుడు మరో గుజరాతీ బిడ్డ మోదీ తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని వొచ్చాడన్నారు. ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన అవసరం లేదని, వేలాది మంది బలిదానం చేసి సాధించిన రాష్ట్రాన్ని ఒకే కుటుంబం కబ్జా చేసిందని మోదీ మండిపడ్డారు. ఇక్కడి ప్రజల కలలను కెసిఆర్ తుంచేశాడని, కాంగ్రెస్ వారితో కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ప్రధాని కోరారు. కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వొచ్చిన రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాదని, బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌తో సంబంధం ఉందని, వాళ్లిద్దరు తెరచాటు ఒప్పందాలు చేసుకున్నారని మోదీ ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ఇలాగే చీకటి ఒప్పందాలు జరిగాయన్నారు.
ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణకే వినియోగిస్తున్నారని అన్నారు. నేడు రైల్వే, ఆరోగ్య పథకాలు తెలంగాణ ప్రజలకు అంకితం చేశామని తెలిపారు. నిజామాబాద్ మహిళలు, రైతులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. వారు ఇచ్చిన అపురూప స్వాగతంతో ధన్యుడినయ్యానని, ఈ ఎన్నికల్లో నారీ శక్తి చూపించాలని, వారి వోట్ల బలంతోనే వాళ్లు బలవంతులు అయ్యారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్సే డబ్బులు పంపిందని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగిందని కుటుంబసభ్యులందరూ దోపిడీ చేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. తనపై నమ్మకం ఉంచి.. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.. కేసీఆర్ కుటుంబం దోచుకున్నదంతా కక్కిస్తానని హావి• ఇచ్చారు. కేసీఆర్ , ఆయన కమారుడు, కుమార్తె, అల్లుడు మాత్రమే ధనవంతులయ్యారని మోదీ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అలయాల సొమ్మునూ దోచుకుంటుందోని విమర్శించారు.
జిహెచ్‌ఎంసి ఎన్నికల అనంతరం సిఎం కెసిఆర్ తనను కలిసి ఎన్‌డిఏలో చేరుతానని ప్రతిపాదించగా తాను అందుకు ఒప్పుకోలేదని ప్రధాని మోదీ సిఎం కెసిఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ అవినీతి, కుటుంబ పాలన కారణంగానే ఆయనను దూరం పెట్టామని అన్నారు. ..కేసీఆర్ గతంలో హైదరాబాద్ ఎన్నికలపుడు తనతో అప్యాయంగా ఉన్నాడని, ఆర్భాటంగా స్వాగతం పలికాడని, కెసిఆర్ సహజ ప్రవృత్తి అదికాదని మోదీ అన్నారు. ఈ విషయాన్ని పత్రికా విలేఖరులు ఒక సారి గుర్తుచేసుకోవాలని మోదీ కోరారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల అనంతరం బిజెపికి 48 రావడం, ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో కెసిఆర్ తాను ఎన్‌డిఏలో చేరుతానని ప్రతిపాదిస్తూ తమకు మద్ధతు ఇవ్వాల్సిందిగా కోరారరి మోదీ అన్నారు.
అందుకు తాను ఒప్పకోలేదని, అవినీతి కారణంగానే కెసిఆర్‌ను దూరం పెట్టానని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కార్యకర్తలను ఎన్ని రకాలుగా వేధించినా భయపడేది లేదని, కాంగ్రెస్ కూటమి రానీయక పోవడంతో మళ్లీ తన దగ్గరికి కేసీఆర్ వొచ్చాడని, తెలంగాణలో తన కొడుకు కెటిఆర్‌కు పట్టం కట్టాలనుకుంటున్నాన•ని, ఆశీర్వాదం కోసం తన దగ్గరికి కొడుకు వొచ్చికలుస్తాడని కెసిఆర్ అన్నాడని మోదీ తెలిపారు. దానికి తాను ఇదిరాజరిక వ్యవస్థ కాదు…మీరెవరు కొడుకుకు పట్టం కట్టడానికి..ఆ హక్కు తెలంగాణ ప్రజలదని తాను స్పష్టం చేశానని మోదీ తెలిపారు. అప్పుడే కేసీఆర్ అవినీతి చిట్టా అంతా తాను చెప్పానన్నారు. అప్పట్నుంచి కేసీఆర్ తనను కలవడం మానేశారని చెప్పారు. ఆ తర్వాత ఆయన ప్రవర్తన మారిపోయిందని, ఇప్పుడు తనను సూటిగా చూడడానికి కూడా కెసిఆర్‌కు ధైర్యం లేదని అన్నారు. కుటుంబ పాలనకు ప్రజలు మరో అవకాశం ఇవ్వొద్దన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా దోపిడీ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణను ఓ కుటుంబం దోచుకుంటుందని ధ్వజమెత్తారు. ఎంతోమంది బలిదానాలతోనే తెలంగాణ సాకారమైందని, తెలంగాణ వొచ్చాక ఒక కుటుంబమే బాగుపడిందన్నారు. కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగిందని, కేసీఆర్, ఆయన కుమారుడు…ఆయన కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులయ్యారని మోదీ విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులనూ బీఆర్‌ఎస్ దోచుకుంటుందని దుయ్యబట్టారు. ఉద్యోగాల్లో అసలైన యువతకు అవకాశం రావడం లేదన్నారు.





