కొరోనా కొత్త వెరియంట్‌ విస్తరించకుండా జాగ్రత్తలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : రాష్ట్రంలో కొరోనా కొత్త వెరియంట్‌ జీఎన్‌-1 మహమ్మారి కట్టడిపై తీసుకుంటున్న మందస్తు చర్యలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి రాజనర్సింహ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడిరచారు.

బుధవారం కేంద్ర మంత్రి మంసుఖ్‌ మండవీయ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల వైద్య, అరోగ్య శాఖ మంత్రులతో జరిగిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ కర్యక్రమంలో మొదటగా దేశంలో వేగంగా విస్తరిస్తున్న కొరోనా కొత్త వెరియంట్‌ జీఎన్‌-1 మహమ్మారి కట్టడిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర మంత్రి వివరిస్తూ రాష్ట్రాలు తీసుకుంటున్న, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *