షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 06: ప్రపంచ మేధావి గా గుర్తించబడిన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మండల అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళను, సమాజలో మార్పు కోసం చేసిన పోరాటం గురించి తెలియచేస్తూ, ఆయన ప్రతిభ, ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను తెలుపుతూ సమాజలో మార్పు కోసం పోరాడిన దళిత గిరిజనులు, మహిళలు,హక్కులు సాధించిన మీరు చాలా గొప్ప వారు అని అన్నారు, అనంతరం ఏర్పాటు చేసిన అంబేద్కర్ డిసెంబర్ 06(1956)
వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పిచారు.
షాద్ నగర్ నియోజకవర్గం లోని ఫరూక్ నగర్ మండలం లోని
వెలిజర్ల గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం, ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ షాద్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు *దొడ్డి శ్రీనివాస్* మండలాధ్యక్షులు *తుప్పరి కుమార్ స్వేరో*, వెలిజెర్ల సెక్టార్ ఇన్చార్జి *మర్రి శివకుమార్*, వెల్జర్ల గ్రామ కమిటీ అధ్యక్షులు *బైండ్ల మల్లేష్*, బూత్ కమిటీ అధ్యక్షులు *చిలకమర్ యాదయ్య*, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు *తుప్పరి జంగయ్య*, బివిఎఫ్ చందు కావలి మహేష్, తుప్పరి శ్రీశైలం, గ్రామ నాయకులు అని మీ గణేష్ గౌడ్ కావలి నరసింహులు యువకులు తదితరులు పాల్గొన్నారు.





