కొత్త వేరియంట్‌ ‌జెఎన్‌-1‌దడ

విందులు, వినోదాల్లో జాగ్రత్తలు తప్పనిసరి

హైదరాబాద్‌,‌డిసెంబర్‌23 : ఏటా డిసెంబర్‌ 31 ‌వచ్చిందంటే న్యూ ఇయర్‌ ‌వేడుకల సందడి జోరుగా ఉండేది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకలపై కొన్ని ఆంక్షలు తప్పేలా లేవు.   మందుబాబులు మాత్రం ఇవే లెక్కచేయకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు నగరంలో న్యూ ఇర్‌ ‌సెలబ్రేషన్స్ ‌కోసం సెలబ్రిటీలు,నటులతో ప్రత్యేక కార్యక్రమాలు.. చేపడుతున్నారు. డీజే సౌండ్లతో యువత డ్యాన్సులు.. కేకుల సందడి,యువత కేరింతలకు రంగం సిద్దం అవుతోంది.  డిసెంబర్‌ 31 ‌దగ్గర పడుతున్నా క్రమంలో ఓవైపు పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. మాస్కులు ధరిస్తే మంచిదని వైద్యులు చెబుతున్నారు.ఈపాటికే స్టార్‌ ‌హోటళ్లు.. ఈవెంట్లు సంస్థలు అర్ధ రాత్రి కొత్త సంవత్సర వేడు కలకు రక రకాల ప్యాకేజీలు, ఆఫర్లతో బు• •ంగ్‌లు మొదలు పెట్టాయి. విందు లు, వినోద ఈవెంట్లతో సందడి చేసేందుకు రంగం సిద్దం చేశారు.  కానీ సరిగ్గా కొత్త సంవత్సరం ప్రారంభానికి మరో వారం రోజుల ముందే కొత్త వేరియంట్‌ ‌సందడి మొదటు పెట్టింది. ఈసారి మరోమారు వైరస్‌ ‌దడ పుట్టిస్తోంది. ఈసారి కేసులు బాగా తగ్గిపోయి అన్నీ సద్దుమణిగి పోతున్నాయనుకునే లోపు మళ్లీ ఇప్పుడు వణుకుతో వేడుకల ఆశలపై నీళ్లు చల్లేఆ ఉంది. కరోనాకు ముందు నగరాలతోపాటు, పట్టణాల్లోను స్టార్‌ ‌హోటళ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్‌ ‌సంస్థలు విందులు, వినోదాలు భారీగా ఏర్పాటు చేసేవి.

ఈయేడు కూడా భారీగానే ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో ప్రభావం తక్కువగా ఉందన్నకారణంగా ఏర్పాట్లు యధావిధిగా సాగుతున్నాయి.  కానీ ఇప్పుడు కొత్తగా జెఎన్‌-1 ‌వేరియంట్‌ ‌వణికి స్తుండంతో కొత్త సంవత్సర వేడుకల కళ తప్పనుందన్న భావన ఏర్పడింది.  ఇప్పటికే  స్టార్‌ ‌హోటళ్ల దగ్గర నుంచి ఓ మోస్తరు రెస్టారెంట్ల వరకు రకరకాల విందులు, వినోదాలు ఏర్పాటు చేసాయి. డీజే బృందాలతోపాటు సినీ నటులను తీసుకువచ్చి సాంస్క•తిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దం అవుతున్నారు. తాజా పరిణామాలతో ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి. కొత్త సంవత్సరానికి మరో వారం రోజులే ఉన్నా తాజా హెచ్చరికలతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది చూడాలి. ఇప్పుడిప్పుడే  అన్ని రంగాలు కోలుకుంటున్నాయి. దీంతో ఈసారి భారీగా న్యూఇయర్‌ ‌వేడుకలకు అన్ని హోటళ్లు భారీగా ప్రణాళికలు సిద్ధం చేశాయి. కానీ కొత్త  ముప్పు అనూహ్యంగా దూసుకుని వచ్చింది. చాపకిందనీరులా వ్యాపిస్తోంది. దీనిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే నని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. కేరళ, కర్నాటక, తమిళనాడుతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా కేసులు నమోదవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *