దేశ చరిత్రలోనే ఇది తొలిసారి..: రాష్ట్ర వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు … 1200 మందికి కొత్తగా అడ్మిషన్లు.. ఇది గొప్ప విజయం..అని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.సోమవారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ .. 1200 సీట్లు ఒక విద్యా సంవత్సరంలో రావడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి..సమైక్య రాష్ట్రంలో గాంధీ హాస్పిటల్ కి వెళ్లి 2004 నుంచి 2014 వరకు నేను మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడాను.తెలంగాణ వస్తేనే మెడికల్ కాలేజీలు వస్తయని, న్యాయం జరుగుతుందని మాట్లాడటం జరిగింది. అని గుర్తు చేసారు . ‘‘సమైక్య రాష్ట్రంలో మూడే మూడు మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్.70 ఏళ్ల సమైక్య పాలనలో మూడు కాలేజీలు వస్తే, ఏడేళ్లలో 17 కాలేజీలు తెచ్చుకున్నం. కొత్తగా 12 కాలేజీలు ఏడేళ్లో తెచ్చుకోగలిగాం. ఉస్మానియా, గాంధీ, సమైక్య రాష్ట్రంలో పెట్టిన 3 కాలేజీలు కలిపి ఐదు ఉంటే కొత్తగా తెలంగాణ రాష్ట్రం 12 కాలేజీలు పెట్టింది..ఈ విద్యాసంవత్సరంలో 8 మెడికల్ కాలేజీలు పెట్టుకుంటున్నం. ఒక్క మెడికల్ కాలేజీకి 510కోట్ల చొప్పున సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. మొత్తం 4080 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది..రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు.
ఈ 8 మెడికల్ కాలేజీలకు మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి వచ్చేందుకు కృషి చేసిన డీఎంఈ గారికి, 8 కాలేజీల ప్రిన్స్ పల్ కు, విమలా ధామస్ , డాక్టర్ వాణి గారికి అభినందనలురిజ్వీ గారి కృషిని అభినందిస్తున్నా..అని తెలిపారు.’’ రాష్ట్రం ఏర్పడినపుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు 850 ఉంటే,ఈ విద్యా సంవత్సరంలో 2901 ఎంబీబీఎస్ సీట్లకు పెంచుకున్నం..ఎంబీబీఎస్ సీట్లు 3.3 రెట్లు పెరిగింది. ఇది చారిత్రాత్మక విజయం..ఇక తెలంగాణ విద్యార్థులు ఉక్రెయిన్, చైనా, ఫిలిఫ్పీన్ వంటి దేశాలకు వెళ్లి వైద్య విద్య అభ్యసించవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితికి కారణం. సమైక్య పాలనలో తెలంగాణపై చూపిన వివక్ష..సీఎం కేసీఆర్ ప్రతీ జిల్లాకు మెడికల్ కాలేజీలు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలకు చెరుకున్నం. విడతల వారీగా మిగతా మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతాయి..అని తెలిపారు.ఇది సీఎం కేసీఆర్ విజనరీ,లీడర్ షిప్ కు నిదర్శనం. అని పేర్కొంటూ ..ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ- ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో 6540 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి..2014 లో ప్రభుత్వ- ప్రయివేటు రంగంలో ఎంబీబీఎస్ సీట్లు కేవలం 2600 ఉన్నయి.
వాటిని నేడు 6540కు పెంచుకున్నం..ఇవి కాక ఆయుష్,ఆయుర్వేద,యూనాని వంటి విభాగాల్లోను సీట్లు ఉన్నయి.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 850 ఎంబీబీఎస్ సీట్ల నుండి 2901 కు పెంచుకున్నం. అంటే 2052 సీట్లు అదనంగా పెంచుకోగలిగాం..ఇది వైద్య విద్యార్థులకు, తల్లిదండ్రులకు పండుగ శుభవార్త..బి క్యాటగిరీ సీట్లలోను 85 లోకల్ రిజర్వేషన్లు అమలు అయ్యేలా చర్య తీసుకున్నం. దీని వల్ల తెలంగాణ వైద్య విద్యార్థులే ఇక్కడ చదువుకునే అవకాశం కలుగుతుంది..ఈ నిర్ణయ వల్ల 1067 సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనుంది..ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులు వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది. అదే రీతిలో పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేసారు .కేంద్రంలో బీజేపీ రాష్ట్రం పట్ల చూపెడుతున్న వివక్షత పై మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు ..’’ ఈవాళ బీజేపీ ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తోంది. మాటలు ఎక్కువ చేతలు తక్కువ..157 మెడికల్ కాలేజీలు దేశంలో మంజూరు చేస్తే, తెలంగాణకు ఒక్క కాలేజీ మంజూరు చేయలేదు.
రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు రాలేదని చెప్తే, రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలు బయటపెట్టాం.కేంద్రం మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి ఇవ్వకపోయిన, సొంత డబ్బులతోనే జిల్లాకో కాలేజి పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నరు. కేంద్రం మొండి చేయి చూపినా రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున కాలేజీలు, మెడికల్ సీట్లు పెంచుకునేలా చర్య తీసుకుంది. 12 కొత్త కాలేజీలు పెట్టుకున్నం. తద్వారా 17 మెడికల్ కాలేజీలు తెలంగాణలో ఉండనున్నాయి. మరో వైపు .కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై…. మాట్లాడుతూ .. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా మేమే కాలేజీలు ఇచ్చాం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడం దిగజారుడు రాజకీయం.. కేంద్ర మంత్రి తన స్థాయి దిగజార్చుకోని సిల్లీగా మాట్లాడుతున్నరు.. మీరు మెడికల్ కాలేజీ ఇస్తే ఎక్కడ ఇచ్చారో చెప్పండి. కాగితాలు చూపించండి.. పేరుకు ఎయిమ్స్ ఇచ్చారు. అక్కడ ఆపరేషన్ ధియెటర్లేదు. ఆక్సిజన్ లేదు. బ్లడ్ బ్యంకులేదు. ఒక్క ఆపరేషన్ జరగడం లేదు..అక్కడి వైద్య విద్యార్థులు తమ విద్య ఆగం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటే వారు భువనగిరి దవాఖాన లో ప్రాక్టికల్స్ చేస్తున్నరు..కాలేజీ ఇవ్వకుండా ఇచ్చామని చెప్పడం దిక్కుమాలిన రాజకీయం. కిషన్ రెడ్డి గారు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్న..అని అన్నారు.



