కొడంగల్ గడ్డపై కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిస్తాం లక్ష్మీనారాయణ రెడ్డి

ప్రజాతంత్ర కొడంగల్ అక్టోబర్ 31:  కొడంగల్ గడ్డపై కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు  కొడంగల్ పట్టణంలోని రేవంత్ రెడ్డి  స్వగృహంలో మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఎనుముల   తిరుపతిరెడ్డి  సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారిని తిరుపతి రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు వారిలో మద్దూర్ మండల అప్పిరెడ్డిపల్లి గ్రామ బి ఆర్ ఎస్  అధ్యక్షులు సందమొళ్ళ శ్రీనివాస్ గుండుమల్ మండల అమ్లీకుంట గ్రామం నుండి పలువురు బీ బాంరాస్ పేట్  మండలం బురాన్పూర్ గ్రామం నుండి పలువురు  బీ ఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు  ఈ సందర్భంగా పార్టీలో చేరిన కార్యకర్తలు  మాట్లాడుతూ తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు ప్రజా వ్యతిరేక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దించడం ఖాయమని కొడంగల్ గడ్డపై రేవంత్ రెడ్డి గారిని గెలిపించడమే లక్ష్యంగా పని చేస్తామని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో కొడంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందారం ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *