కేసీఆర్‌ ‌హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ప్రజల్లోకి…

  • అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా బస్సు యాత్ర
  • జనవరి 16 నుంచి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పర్యటన
  • 90 అసెంబ్లీ సీట్లు లక్ష్యంగా రూట్‌మ్యాప్‌
  • ‌బిజెపి ఎంపి డాక్టర్‌ ‌లక్ష్మణ్‌ ‌వెల్లడి
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30 : ‌తాము ‘కేసీఆర్‌ ‌హఠావో.. తెలంగాణ బచావో’ పేరుతో ప్రజల్లోకి వెళ్తామని బిజెపి ఎంపి డా।। లక్ష్మణ్‌ ‌వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వొస్తే ప్రజలకు ఉచిత వైద్యం, విద్య అందిస్తామని హా ఇచ్చారు. ఏప్రిల్‌ ‌నెలలో జరిగే బీజేపీ భారీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా లేదా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్టా ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ఈ బహిరంగ సభలోనే కేసీఆర్‌ ‌ప్రభుత్వంపై ఛార్జ్ ‌షీట్‌ను విడుదల చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా బీజేపీ బస్సు యాత్రకు ప్లాన్‌ ‌చేస్తుంది. జనవరి 16 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌నియోజకవర్గాల పర్యటన తర్వాత బస్సు యాత్రకు ప్రణాళికలు రెడీ చేస్తుంది.
బండి సంజయ్‌, ‌బీజేపీ సీనియర్‌ ‌నేతలు వేర్వేరుగా యాత్రలు చేయాలని ప్లాన్‌ ‌చేస్తున్నారు. బస్సు యాత్రలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టింగ్స్, ‌పబ్లిక్‌ ‌టింగ్స్ ‌పెట్టాలని నిర్ణయించింది. కేసీఆర్‌ ‌ప్రభుత్వ వైఫల్యాలు నిలదీస్తూ జనంలోకి వెళ్లాలని ప్రణాళికలు రచిస్తుంది. ఒక పార్లమెంట్‌ ‌నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాల్లో బస్సు యాత్రలు ఉండేలా పార్టీ కార్యచరణ రూపోందిస్తుంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర పూర్తి అయ్యాక పార్లమెంట్‌ ‌నియోజకవర్గం కేంద్రానికి చేరుకుని భారీ బహిరంగా నిర్వహించేలా ప్లాన్‌ ‌చేస్తోంది. 90 అసెంబ్లీ, 400 పార్లమెంట్‌ ‌స్థానాలే లక్ష్యంగా బీజేపీ రూట్‌ ‌మ్యాప్‌ ‌సిద్ధమైందని చెప్పారు.  ప్రతి నియోజకవర్గంలోనూ బీజేపీ టికెట్‌ ‌కోసం నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారని ఎంపీ లక్ష్మణ్‌ ‌చెప్పారు. తెలంగాణలో అత్యధిక పార్లమెంట్‌ ‌స్థానాలే లక్ష్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ ‌సంతోష్‌ ఆధ్వర్యంలో రూట్‌ ‌మ్యాప్‌ ‌రూపొందించామని వెల్లడించారు. గతంలో గెలవని 160 పార్లమెంట్‌ ‌స్థానాలపై బీజేపీ స్పెషల్‌ ‌ఫోకస్‌ ‌పెట్టిందన్నారు.
తెలంగాణలో అత్యధిక లోక్‌సభ స్థానాల్లో గెలుపు కోసం నాలుగంచెల వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. రానున్న నెల రోజుల్లో గ్రామ స్థాయిలో పది వేల స్ట్రీట్‌ ‌కార్నర్‌ ‌టింగ్స్ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. మూడు నెలల కాలంలో వేల సంఖ్యలో మండల, జిల్లా స్థాయిలో టింగ్స్ ఉం‌టాయని, జనవరి 20నుంచి ప్రజా గోస..బీజేపీ భరోసా కార్యక్రమంతో ప్రజల్లోకి వెళతామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ‌కుటుంబం తెలంగాణ సంపదను దోచు కుంటుందన్న విధానాన్ని ప్రజలకు వివరిస్తామని లక్ష్మణ్‌ అన్నారు. కేంద్రం పంచాయతీలకు ఇస్తున్న నిధులను దోచుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ ‌సర్పంచ్‌ ‌లే చెప్తున్నారన్నారు. హైదరాబాద్‌ ‌పార్లమెంట్‌ ‌స్థానాన్ని గెలవటమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. తన మాతృమూర్తి హీరాబెన్‌ ‌పెంపకంతోనే ప్రధాని నరేంద్ర మోడీ కర్మయోగీగా మారారని, బాల్యంలో తన తల్లి కష్టాలు చూసి మహిళల కోసం అనేక పథకాలు తీసుకొచ్చిన గొప్ప నేత మోడీ అని ఎంపీ లక్ష్మణ్‌ ‌కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *