భారతదేశం 70శాతం వ్యవసాయరంగం పై ఆధారపడి జీవిస్తుంది అన్నం పెడుతున్న రైతుకు ఏమైనా చేద్దామని ఏ ఒక ముఖ్యమంత్రి కనీసం దృష్టి పెట్టలేదు.ఆరుగాలం కష్టపడి కడుపునింపుతున్న అన్నదాతను కంటికి రెప్పలా కాపాడుకోవాలని కేసీఆర్ కలలు కన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఏటా రెండు విడతల చొప్పున రెండు సీజన్ల లో ఎకరానికి 10వేల పెట్టుబడి సాయం అందించి తెలంగాణ వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చి వేసింది. సీ.ఎం.కేసీఆర్ మానసపుత్రిక రైతుబంధును 2018 మే 10న కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లిలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తొమ్మిది విడుతలుగా 64 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో మొత్తం 1.47 కోట్ల ఎకరాలకు రూ. 57,881 కోట్లు జమచేసింది. రైతు బంధు (పంట పెట్టుబడి సాయం) పథకం వల్ల 90.5 శాతం మంది మన్నును నమ్మిన రైతులు ప్రత్యక్షంగా లబ్ధి పొందుచున్నారు.
ప్రస్తుత యాసింగి సీజన్ కు రైతుబంధు పథకం కింద 10వ విడతలో బాగంగా 66 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,600 కోట్ల నిధులను డిసెంబర్ 28వ తేదీ నుండి వరుస క్రమంలో ఎకరాల వారీగా జమ చేసేందుకు సిద్ధం అయ్యింది.తాజా పంపిణీతో 65 కోట్ల మైలు రాయి దాటింది. ప్రపంచంలో ఎక్కడ లేని విదంగా కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం అవిష్కరణతో బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు, గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్ళిన నైపుణ్యం గల కార్మికులతో పాటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు సైతం సేద్యం చేయడానికి ఇంటిబాట పట్టినారు. అందులోంచి పుట్టిందే రైతుబంధు. ఉమ్మడి రాష్ట్రంలో స్థానికంగా పనులు దొరకనందున్నే వలసలు వెల్లే పరిస్థితి దాపురించిందనేది ఇప్పుడు రుజువు అయ్యింది. రైతుల సంక్షేమం తర్వాతే ఏదైనా సరే సంకల్పం మరోసారి రుజువైంది. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చిన ఏకైక రాష్ట్రంగా, దేశానికి అన్నపూర్ణగా ఎదిగిందనడానికి నేటి తెలంగాణలో 1కోటి 50 లక్షల ఎకరాల సాగు చిత్రం అందుకు నిదర్శనం.
ఉమ్మడి పాలనలో దగా పడిన అన్నధాతలను అన్ని రకాలుగా ఆదుకోవాలనే, కేసీఆర్ దృడ సంకల్పానికి, 75 సంవత్సరాల అమృత మహోత్సవంలో ఏ ఒక్క పాలకుడి ఆలోచనకూ తట్టని అద్భుతమైన పథకం రైతుబంధు. తొమ్మిది విడతలుగా అందించిన రైతు బంధు సాయాన్ని ఎప్పటిలాగే ఆయా రైతుల ఖాతాల్లో ఎక్కడ జమ చేస్తారోనన్న కుట్రతో ఎఫ్ఆర్బీఎం చట్టం దాటి వెళ్ళారంటూ కొత్త అప్పులపై ఆర్థిక ఆంక్షలు విధించింది.రైతుబంధుకు రుణం లభించకుండా చేసింది. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన రుణాలను సమీకరించకుండా అడ్డుకొన్నది. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ 40 వేల కోట్లు రాకుండా కేంద్రం తొక్కి పెట్టింది.అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో సీఎం కేసీఆర్ కేంద్రం కుట్రలను ఛేదించారు.రైతును రాజు చేసేందుకు గతంలో చెప్పినట్లుగానే కేసీఆర్ బ్రతికున్నంత వరకు రైతుబంధు ఆగదని శపథం చేసినట్టే దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చారు.
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అమలు చేయని విధంగా రైతు సంక్షేమం పట్ల కేసీఆర్ అంకితబావానికి సిసలైన ఆనవాళ్ళు రైతుబంధు, రైతుబీమా అవిష్కరణలు. గతంలో ఎన్నడూ లేని విధంగా సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నది. రైతు పక్షపాతి అని చెప్పడానికి ఒక ఉదాహరణ తీసుకుంటే ప్రారంభంలో రైతుబంధు 130లక్షల ఎకరాలకు ఇచ్చేది. ఇప్పుడు రైతుబంధు సాయం 150లక్షల ఎకరాలకు పెరిగింది. కేసీఆర్ తెచ్చిన ‘రైతు బంధు’ లాంటి పథకాన్ని యావత్ భారతదేశమే కాదు ఏకంగా ఐక్యరాజ్యసమితి సైతం ఒక సదస్సులో ప్రశంసించిందంటే రైతులపట్ల కేసీఆర్ కి ఉన్న అంకితభావమే .భారతదేశ వ్యవసాయ రంగంలో నూతన క్రాంతి తెలంగాణ ‘రైతు బంధు’ దేశానికి దారి దీపం కావాలని,కేసీఆర్ నాయకత్వం కోసం యావత్ జాతి ఎర్రతివాచీ వేసి ఎదిరి చూస్తున్నది.
స్వతంత్ర భారత దేశాన్ని దాదాపు 69 సంవత్సరాలు ఏలిన కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు రైతురాజ్యం నిర్మించడంలో ,దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడంలో దారుణంగా విఫలం అయ్యారు.దేశంలో 40కోట్ల ఎకరాల సాగుభూమి ఉన్నప్పటికీ సాగునీరు లేక బీడు భూములుగా, సేద్యానికి నోచుకోకుండా పదవూపడ్డాయని, 70 వేల టీఎంసీల నీటి లభ్యత ఉండి ప్రభుత్వాల ప్రణాళిక లోపం వల్ల సేద్యానికి కావాల్సిన 40 టీఎంసీల నీళ్లను ఒడిసిపట్టడంలో ఇప్పటి,గత ప్రభుత్వాల డొల్లతనం కొట్టచ్చినట్టు ఫలితాలు చెపుతున్నాయి. దానివల్లనే వ్యవసాయాభివృద్ధి ఉహించినంతగా జరుగలేదు. మన తర్వాత స్వాతంత్య్రం పొందిన చైనా అభివృద్ధిలో పరుగులుతీస్తుంటే పనికిమాలిన చట్టాలతో రైతులను నడ్డివిరిచే ప్రయత్నం అస్తమాను చేయడం రైతు వ్యతిరేకిగా చెలమని కావడం ఒకింత కారణం అయ్యింది. దేశంలో పీఎం కిసాన్ పథకం ప్రారంబించినప్పుడు 14.5 కోట్ల మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి ఇప్పుడు 3.87 కోట్లకు పరిమితం చేయడం వారి దివాళాకోరుతనానికి నిదర్శనం.
బృహాత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి, మిషన్ కాకతీయతో జలసిరి రాష్ట్రంగా మార్చి ,పుడమితల్లికి పచ్చాని రంగు వేసి ధాన్యాగారంగా తీర్చిదిద్దిన తెలంగాణలో అమలు అవుతున్నా రైతుబంధు, రైతుభీమా, 24 గంటల మీటర్లు లేని ఉచిత కరెంట్ దేశ వ్యాప్తంగా అమలు చేయాలన్నా, కేంద్రంలోని రైతు వ్యతిరేక, బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలన్నా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భారత రాష్ట్ర సమితితో మాత్రం సాధ్యం అవుతుందని దేశ ప్రజలు నమ్ముతున్నారు.బిఆర్ఎస్ ప్రత్యమ్నాయం అనే బలమైన నమ్మకంతో 26 రాష్ట్రాల నుండి రైతు సంఘాల నాయకులు వచ్చి దేశానికి తెలంగాణ మోడల్ విస్తరించాలని ఆహ్వానించడం,వివిధ రాష్ట్రాల నుండి వస్తున్నా ఆదరణ అనిర్వచనీయం.
డా. సంగని మల్లేశ్వర్,
జర్నలిజం విభాగాధిపతి,
కాకతీయ విశ్వవిద్యాలయం,వరంగల్,
సెల్-9866255355.




