గజ్వేల్, ప్రజాతంత్ర, నవంబర్ 15: పని చేసే ప్రభుత్వన్నీ ఆశీర్వదించండి అన్ని విధాలుగా అండగా ఉంటాం అని భారస మండల అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో గజ్వేల్ మండలంలోని జలిగామ గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితరులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణలో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కండ్లలా చూస్తూ పరిపాలన సాగిస్తున్నారని, బీఆర్ఎస్ అధికారంలో వస్తే తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికీ కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు24గంటల కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారో, 3 గంటల కరెంటు ఇస్తామంటున్నా కాంగ్రెస్కు ఓటేస్తారో ప్రజలు ఆలోచించి, నిర్ణయం తీసుకోవాలనీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తెలిపారు.జలిగామ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ, ఆప్యాయంగా పలకరిస్తూ, అందరితో మమేకమౌతూ ప్రచారం నిర్వహించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి సురక్షితమై తాగు నీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అని గుర్తు చేశారు. గతంలో రైతులు కరెంటు, ఎరువులు, విత్తనాల కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేసేవారని గుర్తుచేశారు.ప్రస్తుతం రైతులకు ఆ పరిస్థితి లేదన్నారు రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతులకు అండగా ఉన్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబీమా, రైతుబంధు, ఉచిత కరెంటును ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. ఆశీర్వదించండి అండగా ఉంటాం అన్నారు.మరోసారి గెలిపిస్తే మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.3000 అందించనున్నట్లు తెలిపారు. రూ.400కు గ్యాస్ సిలిండర్ను అందిస్తారన్నారు. తెల్లరేషన్ కార్డు కలిగిన 93 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా పథకాన్ని అమలుచేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలిపారని అన్నారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.అదే విదంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుండి యూత్ లీడర్లు 50 మంది భారస లో జాయిన్ కావడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపి దాసరి అమరావతి జడ్పీటిసి పంగ మల్లేశం,ప్యాక్స్ చైర్మన్ వెంకటేష్ గౌడ్ రైతుబందు సమీటీ అధ్యక్షుడు మద్ది రాజిరెడ్డి, వైస్ ఎంపీపి కృష్ణ గౌడ్, మండల సమన్వయ కమిటీ సభ్యులు వెంకట్ నర్సింహారెడ్డి, దయాకర్ రెడ్డి, మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, బాస్కర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, చిన్న మల్లయ్య, సర్పంచ్ శివయ్య, నాయకులు రమేష్ గౌడ్, పిడిచేడ్ నర్సింహారెడ్డి, అశోక్ రావు, కుమార్ , మోహన్ బాబు, మల్లయ్య, శివ కుమార్, గౌస్, నరేందర్ రెడ్డి, లక్ష్మన్, ఎల్లం, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ బీమాతో ఇంటింటికీ ధీమా-24 గంటలు కరెంటు కావాలా 3గంటలు కావాలా





