కేసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష

70 ఎండ్లు గా కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు.
కాంగ్రెస్ లో చేరిన వారి రాజకీయ జీవతం సమాప్తం.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
టిఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు కాంగ్రెస్ నాయకులు.
తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 17: కేసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం యలాల మండలం నాగాసముందర్, రాఘవాపూర్, సంగాయి గుట్ట తండా, తాండూరు మండలం కోటబాస్పల్లి, పెద్దెముల్ మండలం జనగాం, బషీరాబాద్ మండల ఎకమై గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి సమక్షంలో బీఅర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తోనే తాండూరు భవిష్యత్ కు బాటలన్నారు. 70 ఎండ్లు గా కాంగ్రెస్ చేసింది ఏమీ లేదుని అన్నారు. డబ్బులకు ఆశపడి కాంగ్రెస్ లో చేరిన వారి రాజకీయ జీవతం సమాప్తం మళ్ళీ తాండూరులో గెలిచేది పైలెట్ రోహిత్ రెడ్డి అని భారీ మెజారిటీతొ రోహిత్ రెడ్డిని గెలిపించుకుంటామని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *