ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 19 : తలకొండపల్లి మండల జడ్పిటిసి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. శుక్రవారం కేటీఆర్ ఆహ్వానం మేరకు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రోద్బలంతో ఉప్పల వెంకటేష్ గుప్తా శనివారం ఒక ఎంపీపీ, 22 మంది సర్పంచులు, 12 మంది ఎంపీటీసీలు పలురు మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని మంత్రి కేటీఆర్ బిఆర్ఎస్ కాండువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వెంకటేష్ చేస్తున్న పలు సామాజిక సేవలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలోకి రావాలని కోరడంతో తాను స్వయంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు ఫోన్ చేసి ఆహ్వానించానన్నారు. భవిష్యత్తులో ఉప్పల వెంకటేష్ కు బిఆర్ఎస్ పార్టీలో మంచి భవిష్యత్తు ఉందని రాష్ట్రస్థాయిలో పదవిని ఇవ్వడం జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే తలకొండపల్లి మండలానికి వస్తా.. మీ సత్తా ఏంటో చూస్తానని బిఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు మధ్య ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ నిర్మల పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


