కేఎల్ఆర్ విజయం కోసం పరితపిస్తూ ప్రచారం

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 9: మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచెన్నగారి లక్ష్మారెడ్డి విజయం కోసం పరితపిస్తూ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలను వెంటబెట్టుకొని ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్కు ఓటు వేయాలని పూర్తిస్థాయిలో కందుకూరు మండల యువజన అధ్యక్షులు దంతోజి నరసింహా చారి పలువురు నాయకులతో కలసి అభ్యర్థిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు ఇచ్చిన గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.దశాబ్దికాలంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏలినా బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసిందని ఆయన ప్రశ్నించారు.ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు మాత్రమే ఉన్నాయని నేడు తెలంగాణ ఏర్పాటు అయ్యాక కేసీఆర్ ప్రభుత్వంలో డబల్ బెడ్రూంలో హామీ ఎవరికి దక్కాయని ఆయన ఆరోపించారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు పన్నీన మహేశ్వరంలో కేఎల్ఆర్ విజయం తథ్యం అని,అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో రాచులూరు గ్రామానికి చెందిన పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొని ప్రచారం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *